Site icon Prime9

Gangrape : బాలికపై మరో ఇద్దరితో కలిసి బాబాయ్ గ్యాంగ్ రేప్

Gangrape

Gangrape

Mahbubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికను ఆమె బాబాయి అత్యాచారం చేసి చంపేశాడు. ఈ ఘటన బాలానగర్ మండలం తిరుమలగిరిలో చోటుచేసుకుంది, బాలికపై వరుసకు బాబాయ్ అయ్యే వక్తి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి గ్యాంగ్ చేశాడు. బాధితురాలి తల్లిదండ్రులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటుంది

అనంతరం ఇద్దరు కలిసి బాలికను హత్య చేశారు. తర్వాత బాలిక ఉరివేసుకున్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో మహిళలకు దగ్గర బంధువులు, పరిచయస్తులనుంచే లైంగికవేధింపులు పెరిగాయి. గత నెలలో పుణెలో వెలుగులోకి వచ్చిన ఘటన దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

విద్యార్థినులకు ఎదురైన లైంగిక వేధింపులపై పుణెలో ఓ జూనియర్‌ కాలేజీలో కమిటీని నియమించి బాధితులెవరైనా ఉంటే తమను సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. ఈ మేరకు నవంబరు 5న 17 ఏళ్ల విద్యార్థిని కమిటీ ముందు తన గోడునంతా వెళ్లబోసుకుంది.తమ స్వస్థలం యూపీ అని.. 2106-18 మధ్య అక్కడ తనపై బాబాయ్‌ పలుమార్లు అత్యాచారం చేశాడని, తాత లైంగికంగా వేధించాడని చెప్పింది. తాను కాలేజీ చదువు కోసం పుణె వచ్చాక ఈ విషయాన్ని లేఖ ద్వారా తండ్రికి వివరించానని వెల్లడించింది. ఆయన తన బాధను అర్థం చేసుకొని కాపాడకపోగా అప్పటి నుంచి అతడూ అత్యాచారం చేస్తున్నాడని వెల్లడించింది. పోక్సో చట్టం కింద బాలిక తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Exit mobile version