Site icon Prime9

Tunisha Sharma: శ్రద్ధావాకర్ హత్య వల్లే నటి తునిషాకి బ్రేకప్ చెప్పా.. ప్రియుడు షిజాన్ ఏం చెప్పాడంటే..?

shraddha-walker-murder-case-forced-breakup-with-tunisha-sharma-said her lover-sheezan-khan-to-police

shraddha-walker-murder-case-forced-breakup-with-tunisha-sharma-said her lover-sheezan-khan-to-police

Tunisha Sharma: బాలీవుడ్ యాక్టర్, సీరియల్ నటి ‘తునీషా శర్మ’సూసైడ్ చేసుకోవడం హిందీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. అయితే తునీషా కేసు విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. శ్రద్దావాకర్ హత్యకేసు వల్లే తునీషాకు బ్రేకప్ చెప్పానని ఆమె లవర్ షీజాన్ పోలీసుల ఎదుట చెప్పాడు. అసలు శ్రద్దావాకర్ హత్యకి తునీషా సూసైడ్ కి ఉన్న సంబంధం ఏంటి.. అసలు వారిద్దరి ప్రేమకు దారితీసిన పరిస్థితులేంటి.. తునీషాకు షిజాన్ కు బ్రేకప్ ఎలా అయ్యింది అనేది ఓ సారి చూసేద్దాం

డిసెంబర్ 24న ఒక సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న తునిషా.. అదే సెట్ మేకప్ రూమ్‌లో ఉరువేసుకొని కనపడడం అందర్నీ షాక్ గురి చేసింది. దానితో సెట్లోని సహాయ నటీనటులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక ఆమె మరణాన్ని పలు కోణాల్లో విచారించిన పోలీసులు.. లవ్ బ్రేకప్ అవడం వల్లే ఆత్మహత్య చేసుకుందని నిర్దారించారు.
కాగా గత కోనేళ్ళుగా తునిషా తన కో-యాక్టర్ ‘షీజాన్ మహమ్మద్ ఖాన్’తో ప్రేమలో ఉంది. తునీషాకి బ్రేకప్ చెప్పడం ఇష్టం లేకున్నా షీజాన్ బలవంతంగా ఆమె నుంచి విడిపోవడానికి ప్రయత్నించడమే ఆమె సూసైడికి కారణమని.. పోలిసుల విచారణలో తెలియజేశాడు ప్రియుడు షీజాన్.

అయితే అతడు బ్రేకప్ చెప్పడానికి కారణాలను పోలీసులకు తెలిపారు షీజాన్ ఖాన్. శ్రద్ధా హత్య కేసు తర్వాత, సోషల్ మీడియా, టీవీలలో జరుగుతున్న చర్చల కారణంగా ఆమె టెన్షన్ పడేదని అతను పేర్కొన్నారు. నాకు తునీషాకు ఎనిమిదేళ్ల వయసు గ్యాప్ ఉండడం, తను హిందూ నేను ముస్లిం అవడం వంటి పలు కారణాల వల్ల భవిష్యత్ లో తమకు ప్రాబ్లమ్స్ వస్తాయనే నేను తునీషాతో పెళ్లికి నిరాకరించానని, బ్రేకప్ చెప్పానని షీజాన్ చెప్పాడు.

ఇకపోతే తునీషా శర్మ చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. ‘భారత్ క వీర్ పుత్ర మహారాణా ప్రతాప్’ సీనియల్‌లో తొలిసారి నటించింది. ప్రస్తుతం తునీషా సోనీ సబ్‌ టీవీలో ‘అలీ బాబా : దస్తాన్-ఎ-కాబూల్’ సీరియల్లో కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ సీరియల్‌లో షహజాది మరియమ్‌ పాత్రలో ఆమె కనిపించనుంది. ఫితూర్‌, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్-3 చిత్రాలలో కూడా తునీషా నటించి మెప్పించింది. ‘ఇంటర్నెట్ వాలా లవ్’ సీరియల్‌లో తునీషా పాత్ర బాగా అందరినీ ఆకట్టుకున్నది. కాగా ఇలా సీరియల్స్ మరియు సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే సహనటుడు షీజాన్ ఖాన్తో ప్రేమలో పడింది.

ఇదీ చదవండి: బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో ఘాట్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్…

Exit mobile version