Minor Girl Rape : యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః.. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని అంటారు. కానీ మన దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా కరీంనగర్ లో వీలుగు లోకి వచ్చిన గహతన కూడా ఈ కోవలోకే వస్తుంది. స్థానికంగా ఇంటర్ చదువుతున్న బాలుడు.. పదో తరగతి చదువుతున్న బాలిక ప్రేమించుకుంటున్నారు. దాదాపు ఏడాది క్రితం వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసిన అతని స్నేహితులు.. వాటిని చూపి తల్లిదండ్రులకు చెబుతామంటూ ఆమెను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. మళ్ళీ ఇప్పుడు ఇది తెలిసి వారిద్దరి స్నేహితులైన మరో ముగ్గురు.. కూడా బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఈ విషయం షీటీమ్ దృష్టికి ఆ బాలిక తీసుకెళ్లడంతో ఈ విషయం వెలుగు లోకి వచ్చింది.
పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. కరీంనగర్ పట్టణంలోని ఓ కాలనీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. అదే కాలనీలో ఉండే ఇంటర్ చదివే బాలుడు, ఆమె ప్రేమించుకునేవారు. సుమారు ఏడాది కిందట ఓ సందర్భంలో వారిద్దరు సన్నిహితంగా ఉన్న వీడియో, ఫొటోలను బాలుడి ఇద్దరు స్నేహితులు రహస్యంగా చిత్రీకరించారు. వాటిని చూపుతూ..తల్లిదండ్రులకు చెబుతామని బెదిరించి బాలికను లొంగదీసుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా ఇటీవల వారి స్నేహితులైన మరో ముగ్గురు బాలికను లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. మూడు రోజుల కిందట విషయం షీటీమ్ దృష్టికి వెళ్లడంతో వారు.. అఘాయిత్యానికి పాల్పడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టి విషయాన్ని రహస్యంగా ఉంచారు. కాగా సోమవారం బాలిక తల్లిదండ్రులతో కలిసి నగరంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఆమె ప్రేమికుడితో కలిపి ఆరుగురిపై పోక్సో, అత్యాచారం, బెదిరింపుల కేసు నమోదు చేశారు. కేసు నమోదైన ఆరుగురిలో అయిదుగురు ఇంటర్ చదువుతుతుండగా.. మరో వ్యక్తి పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం పూర్తిచేశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించామని వెల్లడించారు. ఆ ఆరుగురు నిందితులలో ఐదుగురు మైనర్లు కాగా.. ఒకరు మాత్రమే మేజర్ అని సమాచారం అందుతుంది.