Site icon Prime9

Murder News : విశాఖలో అత్యంత దారుణ ఘటన.. మహిళను చిత్రహింసలకు గురి చేస్తూ అత్యాచారం.. హత్య !

latest crime news about married woman murder at shamshabad

latest crime news about married woman murder at shamshabad

Murder News : విశాఖపట్నం జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వివాహితను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేయడం తీవ్ర సంచలనంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని ఓ గ్రామంలో భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వివాహిత (32) నివాసముండేది. గ్రామ సమీపంలోని ఓ కంపనీలో ఆమె పనిచేసేది. ఇటీవల ఎప్పటిలాగే ఉదయం పనిచేసే కంపనీకి వెళ్లిన ఆమె రాత్రి ఇంటికి తిరిగి  రాలేదు. దీంతో కంగారుపడిపోయిన భర్త, కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు.

అయితే ఈ నెల 11న (ఆదివారం) రాత్రి విశాఖ జిల్లా తగరపువలస సమీపంలో ఓ మహిళ మృతదేహం పడివున్నట్లు భీమిలి పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే జాతీయ రహదారి సమీపంలోని చెట్లపొదల్లో తీవ్ర గాయాలతో పడివున్న మృతదేహాన్ని పోలీసులు పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మృతదేహం విజయనగరంలో జిల్లాలో మిస్సయిన వివాహితదిగా గుర్తించిన పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

ఆమె ఒంటిపై గాయాలను బట్టి ఆమెపై అత్యాచారం జరిగినట్లు అనుమానించగా పోస్టుమార్టం రిపోర్ట్ లో కూడా అదే తేలింది. ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూ అత్యాచారానికి పాల్పడినట్లు.. ఆపై హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. తల్లి మృతదేహం వద్ద ఇద్దరు బిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులందరిని కలచివేసింది.

Exit mobile version