Site icon Prime9

Drugs Case : డ్రగ్స్ కేసులో రజినీకాంత్ “కబాలి” మూవీ ప్రొడ్యూసర్ అరెస్ట్..

rajini kanth kabali movie producer kp chowdary arrested in drugs case

rajini kanth kabali movie producer kp chowdary arrested in drugs case

Drugs Case : చిత్ర పరిశ్రమలో మరోసారి డ్రగ్స్ ముఠా కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వీరు నుంచి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. అలానే వీరి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్న వారి వివరాలను సేకరించారు. ఈ మేరకు వారికి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్న సినీ నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్ వాడుతున్నట్లు కూడా తేలింది.

ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “కబాలి” చిత్రాన్ని నిర్మించారు. గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నట్లు సమాచారం.  ఆయన వద్ద ఉన్న కొకైన్ ను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ టాలీవుడ్ డ్రగ్స్ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version