Rajasthan: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఒక భూవివాదంలో ఒక వ్యక్తి తన సోదరుడిని ట్రాక్టర్ తో తొక్కించి చంపాడు. ఈ ఘటనలో అతను ట్రాక్టర్‌ను ఎనిమిది సార్లు ముందుకు వెనుకకు నడిపడంతో అతని సోదరుడు అక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై రాజస్థాన్ ప్రజలు, ప్రతిపక్షాల నుంచి సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రెండు కుటుంబాల మధ్య..(Rajasthan)
హతుడు నిర్పత్‌ను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితుడు దామోదర్‌ను అరెస్టు చేశారు. భరత్‌పూర్‌లోని ఓ భూమి విషయంలో బహదూర్ సింగ్, అతర్ సింగ్ అనే రెండు కుటుంబాల మధ్య వివాదం హింసాత్మకంగా మారడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇరు కుటుంబాలు ఒకరిపై ఒకరు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు.ఘర్షణ జరుగుతుండగా, అతర్ సింగ్ కుమారుడు నిర్పత్ నేలపై పడిపోయాడు, అతనికి వరుసుకు సోదరుడు అయ్యే దామోదర్ అతన్ని ట్రాక్టర్‌తో తొక్కించి చంపాడు. ఈ ఘర్షణల్లో పది మంది గాయపడ్డారు. ఈ వివాదంలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
ఇలాఉండగా ఈ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్దితిని తెలియేస్తోందని ప్రతిపక్ష బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ఇది మానవత్వానికి మచ్చ అని అన్నారు.
భరత్‌పూర్‌లో పర్యటించాలని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రాకు సవాలు విసిరారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ భరత్‌పూర్ ఘటన హృదయాన్ని కలచివేసిందన్నారు. గెహ్లాట్ ప్రభుత్వ హయాంలో తలెత్తిన నేరపూరిత, అరాచక మనస్తత్వాల ఫలితమే ఈ ఘటన అని అన్నారు.