Site icon Prime9

Crime News: పలాసలో సైకో వీరంగం.. వృద్ధుడి తల పగులగొట్టిన వైనం!

psycho halchal in kasibugga

psycho halchal in kasibugga

Crime News: మద్యం మత్తులో, మానసిక సమస్యలతో కొందరు యువకులు సైకోల్లా ప్రవర్తిస్తూ నానా బీభత్సం సృష్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి శ్రీకాకుళం జిల్లా పలాసలో చోటుచేసుకుంది. వృద్ధుడిపై దాడి చేసి ఓ సైకో వీరంగం సృష్టించడం తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీలోని కాశీబుగ్గ పెట్రోల్ బంకు సమీపంలో టీ దుకాణం దగ్గర కామరాజు అనే వృద్ధుడు టీ తాగుతూ ఉన్నాడు. అకస్మాత్తుగా అక్కడి వచ్చిన ఓ సైకో కర్రతో వృద్ధుడిపై దాడి చేశాడు. విచక్షణారహితంగా తలపై మోది తలపగులగొట్టాడు. దీని స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. తలకు గాయమై రక్తపు మడుగులో పడి ఉన్న కామరాజును చూసి స్థానికులు పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.సైకోను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అతన్ని విద్యుత్ స్తంభానికి కట్టేసి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సైకోను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా వీరంగం సృష్టించిన సైకోను జడ గోవిందరావుగా పోలీసులు గుర్తించారు. వృద్ధుడి ఫిర్యాదు మేరకు సైకోపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు కాశీబుగ్గ సీఐ శంకరరావు వెల్లడించారు.

ఇదీ చదవండి: ప్రేమజంటపై గంజాయి బ్యాచ్ దాడి.. ప్రేమికుడి ముందే ప్రియురాలిపై అత్యాచారయత్నం

Exit mobile version