Oyo Rooms:హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లోని పలు ఓయో రూమ్లపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. కేపీహెచ్ బీ కాలనీలోని పలు ఓయో రూమ్ లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 9 మంది యువతులను పోలీసులు రక్షించారు. కొన్ని ఓయో రూమ్స్‌లో ప్యాకెట్ల కొద్దీ కండోమ్స్ కనిపించాయి. పబ్‌లు, లాడ్జీలపై పోలీసుల నిఖా పెరడగంతో జల్సా రాయుళ్లు రూటు మార్చారు. నగర శివార్లలో ఉండే గెస్ట్, ఫాంహౌసులు, ఓయో రూములను అడ్డాగా మార్చుకొని పేకాట, హుక్కా, మద్యం సేవించడం, వ్యభిచారం లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన సైబరాబాద్ పోలీసులు ఓయో రూములు, లాడ్జీలు, ఫామ్‌హౌసులు, పబ్‌లు, దాబాలపై మెరుపు దాడులు నిర్వహించారు.
సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు గత శనివారం రాత్రి కూడా 8 ఓయో లాడ్జీలు, 11 ఫామ్‌హౌస్‌లు, 6 పబ్‌లు, 14 దాబాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారితో పాటు నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్‌లోని లక్ష్మీ విల్లా గెస్ట్‌హౌస్‌లో గంజాయి సేవిస్తున్న పలువురిని అరెస్ట్ చేశారు.
కేపీహెచ్‌బీలోని హోటల్ కార్తికేయ రెసిడెన్సీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి దాడులు చేశారు. షామీర్‌పేటలోని జాస్మిన్ ఫాంహౌస్‌లో గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా. హుక్కా, మద్యం సేవించేందుకు అనుమతించిన శంషాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి, హుక్కా ఫ్లేవర్లు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
మొయినాబాద్‌లోని పలు ఫాంహౌస్ ల్లో మహిళలతో ముజ్రా పార్టీ, మద్యం, హుక్కా సేవిస్తున్న పలువురిని అరెస్ట్ చేసి, ఫాం నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. ముజ్రా పార్టీలో 17 మంది యువకులు, నలుగురు యువతులను గుర్తించారు. వారి నుంచి కండోమ్‌లు, 100 గ్రాముల గంజాయి, గంజాయి నింపిన సిగరెట్లు, 11 హుక్కాపాట్‌లు, 10 హుక్కా పైపులు, హుక్కాఫ్లేవర్లు, సిల్వర్ పేపర్లు, మద్యం బాటిళ్లతోపాటు 7 కార్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.