Site icon Prime9

Drugs: డ్రగ్స్ కి బానిసైన దంపతులు ..మత్తు కోసం కన్న బిడ్డలని అమ్ముకున్నారు ..

mumbai-couples-sold-childrens-for-drugs

mumbai-couples-sold-childrens-for-drugs

Drugs: డ్రగ్స్ తీసుకోవడం ఈ రోజుల్లో చాలా మామూలు విషయం అయిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా మత్తులో మునిగి తేలుతున్నారు.. డ్రగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డువచ్చిన వారి అడ్డును తొలగిస్తున్నారు.మత్తులో కళ్ళు మూసుకుపోయి ఎన్నో అనర్దాలకు కారణం అవుతున్నారు .  ఆ మత్తు కోసం ఎన్నో దారుణాలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు .తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరీ ఏరియాకు చెందిన షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా డ్రగ్స్‌కు అలవాటుపడ్డారు.. వారు అలా మత్తు కోసం మనుషులు అనే సంగతి కూడా మర్చిపోయారు.. డ్రగ్స్ కోసం కడుపున పుట్టిన బిడ్డనే అమ్ముకున్నారు.. ఎంత దారుణం..

అసలు విషయానికొస్తే.. తమ రెండేళ్ల కుమారుడితో పాటు నెల రోజుల పసిపాపను విక్రయించారు. తొలుత తమ రెండేళ్ల కుమారుడిని రూ.60వేలకు అమ్ముకున్నారు. నెల రోజుల పసిపాపను కూడా షకీల్ మక్రానీ అనే వ్యక్తికి రూ. 14 వేలకు విక్రయించారు.. ఇదిలా ఉండగా ఈ విషయం కాస్త షబ్బీర్ ఖాన్ సోదరి రుబీనాకు ఈ విషయం తెలియడంతో ఆగ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి.. షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా ఖాన్‌తో పాటు ప బిడ్డను కొనుగోలు చేసిన షకీల్ మక్రానీ, డ్రగ్స్‌ ఏజెంట్‌ ఉషా రాథోడ్‌ను అరెస్ట్‌ చేశారు.

వారు అమ్మేసిన పసిపాపను శుక్రవారం ముంబైలోని అంధేరీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నారు. షబ్బీర్ దంపతులు అమ్మేసిన రెండేళ్ల కుమారుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.. అరెస్టయిన నిందితుల్లో తల్లిదండ్రులు షబ్బీర్, సానియా ఖాన్, షకీల్ మక్రానీ ఉన్నారు. విక్రయం ద్వారా కమీషన్ తీసుకున్న ఉషా రాథోడ్ అనే ఏజెంట్‌ను క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకుంది.డ్రగ్స్‌కు బానిసైన దంపతులు అంధేరీలో డబ్బు సంపాదించడానికి తమ ఇద్దరు పిల్లలను అమ్మేశారు. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే, జంట కుటుంబీకుల కథ వెలుగులోకి వచ్చింది. మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితులు దంపతులు. అసలు పిల్లలను ఎవరు కొన్నారో అనే విషయం ఇంకా తెలియలేదు.. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

 

Exit mobile version