Site icon Prime9

Muder Case : వివాహితను దారుణంగా హతమార్చిన ప్రియుడు.. ఎందుకంటే ?

Muder Case of married women at eluru district

Muder Case of married women at eluru district

Muder Case : ఏలూరు జిల్లా లోని పోలవరం లోని బాపూజీ కాలనీలో సంకురు బుజ్జమ్మ అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమె వయస్సు 35 సంవత్సరాలు. కాగా వివాహిత అయిన బుజ్జమ్మ కొన్ని కారణాల చేత గత 15 సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటూ.. ఒంటరిగా నివసిస్తుంది. అయితే ఈ క్రమంలో షేక్ సుభాని అనే వ్యక్తి తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నది అని సమాచారం.

కానీ ఏం జరిగిందో తెలియదు గానీ.. మహిళ పైన షేక్ సుభాని విచక్షణారహితంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. అనంతరం నిందితుడు పోలీసు స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అయితే హత్యకు గల కారణాలు తెలియలేదు.. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయని.. ఆ మనస్పర్థల కారణంగానే నిందితుడు హత్య చేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఈ నిందితుడి అంగీకారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ కేసుకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జీవితంలో అత్యంత ముఖ్యమైన బంధాలలో భార్యభర్తల బంధం ఒకటి.. అక్కడ విఫలం అయ్యి.. చివరికి వివాహేతర సంబంధంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం.. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు గా జరిగాయి. అలాంటి ఘటనే మళ్ళీ హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version