Minor Girl Gang Rape:సికింద్రాబాద్ నేరేడ్ మెట్ పరిధిలో దారుణం జరిగింది. కాచిగూడలో ఉండే మైనర్ బాలికను ట్రాప్ చేసి.. నేరేడ్ మెట్ కు తీసుకువెళ్లి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
గంజాయి అలవాటు చేసి..(Minor Girl Gang Rape)
కాచిగూడ ప్రాంతానికి చెందిన బాలిక హైస్కూల్ వరకు చదువుకుని ఇంటివద్దే ఉంటోంది. బాలిక తల్లి కూలిపనులు చేసుకుంటోంది. ఇంటివద్దే ఉంటున్న బాలిక అదే ప్రాంతంలోని మరో బాలికతో స్నేహం చేసేది. ఈ నేపధ్యంలో సదరు బాలికతో పరిచయం ఉన్న ఒక యువకుడు ఫోన్ ద్వారా పరిచయం అయ్యాడు. బాలికను యువకుడు బైక్ మీద నేరేడ్ మెట్ వద్దకు తీసుకు వచ్చి గంజాయి అలవాటు చేసాడు. మత్తులో ఉన్న బాలికపై మరో నలుగరితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పకుండా మైనర్ బాలిక దాచిపెట్టింది. అమ్మాయి శరీరంలో మార్పులు రావడం గమనించి తల్లి నిలదీసింది. జరిగిన ఘోరాన్ని తల్లికి మైనర్ బాలిక వివరించింది. తల్లితో కలిసి కాచిగూడ పోలీసు స్టేషన్ కు వెళ్లి బాలిక ఫిర్యాదు చేసింది. దీనితో అత్యాచారం చేసిన యువకుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.