Site icon Prime9

Teen set on fire: అమ్మాయితో ప్రేమాయణం.. యవకుడిని కిడ్నాప్ చేసి నిప్పంటించిన బంధువులు

Teen set on fire

Teen set on fire

Teen set on fire: బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌కు చెందిన 18 ఏళ్ల యువకుడిని తన దూరపు బంధువును ప్రేమిస్తున్నాడని కిడ్నాప్ చేసి నిప్పంటించారు. బాధితుడిని శశాంక్‌గా గుర్తించారు. కాలిన గాయాలతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

బంధువుల బెదిరింపులు.. (Teen set on fire)

ఏసీఎస్ కాలేజీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న శశాంక్‌ను నగర శివార్లలో కిడ్నాప్ చేసి నిప్పంటించారు. . శశాంక్ ప్రేమించిన యువతి తన దూరపు బంధువని అతని తండ్రి రంగనాథ్ తెలిపారు. గత రెండు వారాలుగా, శశాంక్ మరియు అమ్మాయి ఒకరినొకరు వారి ఇళ్లలో కలుసుకున్నారు. ఇది అమ్మాయి కుటుంబానికి కోపం తెప్పించింది . దీనితో వారు శశాంక్‌ను హెచ్చరించారు.రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. తమ సంబంధాన్ని కొనసాగిస్తే శశాంక్‌ను కాల్చివేస్తామని బాలిక మేనమామ ఒకరు బెదిరించారు. ఆ తర్వాత శశాంక్ బాలికకు దూరమయ్యాడని బాధితురాలి తండ్రి తెలిపారు.నివారం కళాశాల నుంచి శశాంక్ ఇంటికి వెళ్తుండగా బాలిక కుటుంబానికి చెందిన ఏడుగురు వ్యక్తులు కారులో వచ్చి అతడిని కిడ్నాప్ చేశారు. కనిమినికే టోల్ ప్లాజా వద్దకు తీసుకెళ్లి నిప్పంటించారు.ఈ ఘటనపై కుంబాలగోడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

 

Exit mobile version