Site icon Prime9

Crime News : హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. మాదాపూర్ లో !!!

crime-news-about-man killing-wife-and-daughter-by-snake

crime-news-about-man killing-wife-and-daughter-by-snake

Crime News : హైదరాబాద్ లోని మాదాపూర్ లో గల ఓ హోటల్ గదిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బయటికొచ్చింది. హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుదుచ్చేరి లోని కామరాజ నగర్ నివాసి.. ఎస్ శరవణప్రియ (25) కొద్ది కాలం క్రితం తెలంగాణలోని జడ్చర్లకు వలస వచ్చింది. స్థానికంగా ఉన్న ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. కాగా చెన్నై కి చెందిన  శ్రీహరి రమేష్ (25) తన తండ్రి వ్యాపార పనులు చూసుకుంటూ అక్కడే ఉంటాడు. అయితే వీరిద్దరూ చెన్నైలో ఒకే కాలేజీలో ఇంటర్ వరకు చదువుకోగా మంచి స్నేహితులుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే వ్యాపార పనుల్లో భాగంగా శ్రీహరి రెండు రోజుల క్రితం హైదరాబాదుకు వచ్చాడు.

హైదరాబాదులోనే ఉండడంతో ఆమెను కలవాలి అని అనుకున్నాడు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్డు నెంబర్ 36లో గోల్డెన్ హైవ్ ఓయో హోటల్ గదిలో తమ కోసం రూమ్ బుక్ చేశాడు. స్నేహితుడిని కలుసుకోవడం కోసం శరవణ ప్రియ మంగళవారం రాత్రి హోటల్ రూమ్ కు వచ్చింది. ఇద్దరూ హోటల్ రూమ్ లోనే మద్యం  తాగి నిద్రపోయారు. అయితే, అర్ధరాత్రివేళ శ్రీహరికి వాంతులయ్యాయి. దీంతో, బుధవారం తెల్లవారు జామున శ్రీహరి చికిత్స కోసం దగ్గరలోనే ఉన్న శ్రావణి ఆసుపత్రికి వెళ్ళాడు.

అక్కడ చికిత్స తీసుకున్న తర్వాత.. కాస్త కుదుట పడ్డాక మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో డిశ్చార్జ్ అయి హోటల్ కి వచ్చాడు. తమ గదిలోకి వెళ్లి తలుపు తీసి చూడగా, గదిలో ఉన్న శరవణప్రియ చలనం లేకుండా కనిపించింది. ఆమె పడుకున్న తీరు కూడా అనుమానాస్పదంగా ఉంది. మంచానికి ఒరిగి, నేలపై కూర్చుని మృతి చెంది కనిపించింది. వెంటనే హోటల్ సిబ్బందికి సమాచారం అందించగా.. వారు పోలీసులకు తెలిపారు. హోటల్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఉదయం 10:49 నిమిషాల సమయంలో శరవణ ప్రియ రిసెప్షన్ కు ఫోన్ చేసింది. తమ రూమును ఇంకో రోజుకు పొడిగించాలని చెప్పుకొచ్చింది.

ఆ తరువాత జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసింది. జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ తీసుకుని వచ్చిన తర్వాత.. ఎన్ని సార్లు బెల్లు కొట్టినా ఆమె తలుపు తీయలేదు. దీంతో.. ఆర్డర్ చేసిన ఫుడ్ పాకెట్ ను రిసెప్షన్లో ఇచ్చి డెలివరీ బాయ్ వెళ్ళిపోయాడు. ఫుడ్ ఆర్డర్ చేసి, వచ్చేలోపు ఏం జరిగిందనేది అనుమానాస్పదంగా మారింది. అయితే పోలీసులు మాత్రం అనారోగ్యం కారణంగానే ఆమె మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.

Exit mobile version