Kakinada Women Murder : రోజులు మారుతున్నా.. మనుషులలో మార్పు రావడం లేదు. మహిళలు, యువతులు, బాలికలపై మృగాళ్లు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసు అధికారులు నిఘా పెంచుతున్నా.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా కానీ ఈ అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇప్పటికే కామాంధుల చేతిలో మహిళలు, అభం శుభం తెలియని చిన్నారులు సైతం ఎందరో అశువులు బాసారు. ఇంటా, బయట మహిళలకు నానాటికి రక్షణ కరువుతుంది అనడంలో సందేహం లేదు.
పట్టణాలు, గ్రామాలు, మారుమూల ప్రాంతాలు అనే తేడా లేకుండా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద నగరాల్లో సైతం అబలల పై దాడులు ఆగడం లేదు అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్దం చేసుకోవాలి. తాజాగా బెంగళూరులో కాకినాడకు చెందిన యువతిని శ్రీకాకుళంకి చెందిన యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆమె పనిచేసే ఆఫీసు వద్దే ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు.. విచక్షణారహితంగా 16 సార్లు కత్తితో పొడిచి ఆ యువతిని చంపాడు. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
పెళ్ళికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో (Kakinada Women Murder)..
ఈ దారుణానికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. బెంగుళూరులోని మురుగేశ్‌పాల్య ఏరియాలో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన లీలా పవిత్ర బెంగళూరులోని మురుగేశ్‌పాల్యలో ఉన్న ఒమెగా హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లో ఉద్యోగం చేస్తోంది. కాగా శ్రీకాకుళానికి చెందిన దినకర్ కూడా దొమలూరులో ఓ హెల్త్‌కేర్ సంస్థ లోనే పనిచేస్తున్నాడు.
గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న ఇరువురూ.. పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇద్దరిదీ వేర్వేరు కులాలు కావడంతో లీలా కుటుంబం మాత్రం ఈ పెళ్లికి అభ్యంతరం చెప్పింది. కాగా ఈ మేరకు ఈ విషయం తన ప్రియుడు దినకర్‌కి లీలా తెలిపింది. తల్లిదండ్రుల నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని.. వాళ్లు చూసిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని దినకర్‌కి చెప్పింది. అయితే మంగళవారం నాడు లీలా విధులు ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత.. ఇరువురి మధ్య పెళ్లి విషయమై మరోసారి వాగ్వాదం జరిగింది. దీంతో ప్రియురాలిపై ఆగ్రహంతో రగిలిపోయిన ఆ యువకుడు.. లీలాను ఆమె పనిచేసే ఆఫీసు వద్దే కత్తితో దాడిచేసి చంపాడు. అందరూ చూస్తుండగానే 16 సార్లు ఆమెను పొడిచి హత్య చేశాడు.
ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని రక్తపు మడుగులో కొన ఊపిరితో ఉన్న లీలను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు దినకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/