Site icon Prime9

Hyderabad: ఐటీ అధికారలమని చెప్పి.. 2 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు

Hyderabad

Hyderabad

Hyderabad: వ్యాపారాలతో ఎప్పుడూ రద్దీ గా ఉండే సికింద్రాబాద్ లో పట్ట పగలే భారీ చోరి జరిగింది. స్థానిక మోండా మార్కెట్ లో ఐటీ అధికారుమంటూ ఓ నగల షాపుకి వెళ్లిన కొందరు 2 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. అచ్చం సినీ పక్కీలో పట్ట పగలు అందరూ చూస్తుండగానే ఈ చోరి చోటు చేసుకుంది.

 

అమ్మకాల్లో అవకతవకలని చెప్పి(Hyderabad)

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం 5 గురు వ్యక్తులు మోండా మార్కెట్‌లోని ఓ జ్యూవెలరీ షాప్ కు వచ్చారు. బంగారం అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడ్డారని బెదిరించారు. షాప్ లో ఉన్న బంగారం మొత్తం తనిఖీ చేయాలని.. అక్కడున్న సిబ్బందిని పక్కన కూర్చోబెట్టి.. షాపులో ఉన్న 1700 గ్రాముల బంగారానికి సంబంధించి ఎలాంటి ట్యాక్స్‌ చెల్లించలేదని చెప్పారు. దీంతో ఆ బంగారం స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అక్కడి నుంచి బంగారంతో వెళ్లిపోయారు.

ఎలాంటి అనుమానం రాకుండా(Hyderabad)

దీంతో షాప్ ఓనర్ మిగతా జ్యూవెలరీ షాపుల యజమానులకు ఐటీ అధికారులు వచ్చి బంగారం స్వాధీనం చేసుకున్న విషయాన్ని తెలియజేశాడు. ఐటీ అధికారులు ఇలా వచ్చి తనిఖీలు చేయరని.. ముందుగా నోటీసులు ఇస్తారని చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన షాప్ యజమాని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐటీ అధికారులతో సంప్రదించగా.. వచ్చింది నకిలీ ఐటీ అధికారులుగా తేలింది. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులు ఐటీ అధికారుల పేరుతో సోదాలు చేసినట్టు గుర్తించారు. బంగారం షాపు యజమానికి ఎలాంటి అనుమానం రాకుండా ఐటీ అధికారులు ఎలా సోదాలు నిర్వహిస్తారో.. అదే పద్ధతిలో చేశారు. షాపులో పనిచేస్తున్న సిబ్బందిని ఒక పక్కన కూర్చోబెట్టి తనిఖీలు చేశారని పోలీసులు తెలిపారు. దోపిడీ తర్వాత నిందితులు సికింద్రాబాద్‌ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్లినట్టు గుర్తించారు.

 

పక్కా సమాచారంతోనే.. – పోలీసులు

మోండా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ భారీ చోరీ ఘటనలో నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి 6 మందికి ఈ ఘటనతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఐటీ అధికారులమంటూ ఐడీ కార్డులు చూపించి కార్ఖానాలో ఉన్న 17 బంగారం బిస్కట్లు (ఒక్కోటి 100 గ్రాములు) ఎత్తుకెళ్లారన్నారు. బంగారం స్వాధీనం చేసుకున్న తర్వాత పనివాళ్లను లోపలే పెట్టి బయట గడియపెట్టారని తెలిపారు. డెలివరీ చేసేందుకు బంగారం సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని.. తెలిసిన వాళ్ల పనేనని భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 

 

 

 

 

Exit mobile version