Site icon Prime9

Hyderabad Builder killed: కర్ఱాటకలో హైదరాబాద్ బిల్డర్ దారుణ హత్య

Hyderabad Builder

Hyderabad Builder

 Hyderabad Builder killed: హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన బిల్డర్ కుప్పాల మధు (48) కర్ణాటకలో దారుణ హత్యకు గురయ్యారు. ఈ నెల 24న చింతల్ లో అదశ్యమయిన మధు బీదర్ లో హత్యకు గురయ్యారు. మధు దగ్గర ఉన్న ఐదు లక్షల రూపాయల నగదు, విలువైన అభరణాలు మాయం అయినట్లు సమాచారం.

స్నేహితులే చంపేసారు..( Hyderabad Builder killed)

ఇలాఉండగా మధు హత్య కేసులో సంచలన విషయాలు బయటకి వస్తున్నాయి. మధును ఆయన స్నేహితులే చంపినట్లు తేలింది. రేణుకా ప్రసాద్, లిఖిత్ సిద్ధార్థ్‌రెడ్డి, వరుణ్‌తో మధుకు స్నేహం చేశారు. క్యాసినో ఆటలో మధుకు, రేణుకా ప్రసాద్‌ గ్యాంగ్‌తో పరిచయం ఏర్పడింది. క్యాసినో ఆడుదామని తీసుకునివెళ్లి మధును హత్య చేశారు. మధు చిన్న కూతురుపై కన్నేసిన రేణుకా ప్రసాద్..తనకు ఇచ్చి పెళ్లి చేయమని కోరాడు. రేణుకా ప్రసాద్‌తో పెళ్లికి మధుకు ఒప్పుకోలేదు.. దీనితో కక్ష పెంచుకున్న రేణుకా ప్రసాద్ మధును చంపడానికి స్కెచ్ వేశాడు. ముందుగా హైదరాబాద్‌లోనే హత్యకు ప్రణాళిక వేసి.. సుపారీ గ్యాంగ్‌ను నెలరోజులు హైదరాబాద్‌లో ఉంచాడు. అయితే హైదరాబాద్‌లో హత్యకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో క్యాసినో ఆడుదామని బీదర్‌కు తీసుకెళ్లి మధును దారుణం హత్య చేశారు.

బిల్డర్ మధు కేసులో వెలుగులోకి సంచలన నిజాలు | Hyderabad Builder Madhu Case Updates | Prime9 News

 

Exit mobile version
Skip to toolbar