Site icon Prime9

Husband killed Wife: కట్టుకున్న మొగుడే కాలయముడయ్యాడు.

BCHP

BCHP

.Husband killed Wife: జీవితాంతం తోడుంటానన్న భర్త చివరికి భార్యనే హతమార్చాడు. ఈ దారుణం బాచుపల్లిలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. నాగేంద్ర భరద్వాజ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ అయిన తన భార్య మధులతను కత్తితో పొడిచి చంపాడు.

గ్యాస్ లీకేజీగా చూపాలని..(Husband killed Wife)

అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతీ గ్యాస్‌ లీకేజ్‌ చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కుటుంబకలహాలే హత్యకు దారితీశాయి. మధులత తండ్రి రంగనాయకులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసి రిమాండ్ తరిలించారు. పెళ్లైన కొంత కాలం బాగానే ఉన్నా తర్వాత దంపతుల మధ్య క్రమంగా గొడవలు మొదలై చివరకు ఈ దారుణానికి దారితీసినట్లు తెలుస్తోంది.

Exit mobile version