Site icon Prime9

ఒడిస్సా: పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక ప్రియురాలిని 49 సార్లు పొడిచి చంపేసాడు

odisa

odisa

Odisha: ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఓ వ్యక్తి తన ప్రియురాలిని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక కత్తితో 49 సార్లు పొడిచి చంపాడు. జగన్నాథ్ గోదా అనే ఈ వ్యక్తిని అతని ప్రియురాలైన కునిదర్ సీమదాస్ గత కొంతకాలంగా పెళ్లిచేసుకోవాలని బాగా ఒత్తిడి చేస్తోంది. దీనితో ఆమెను వదిలించుకోవడానికి ప్లాన్ చేసిన గోదా తనతో గుజరాత్‌లోని సూరత్‌కు రమ్మని కోరాడు.

అక్కడకు వెళ్లిన తరువాత నగరాన్నిచూసి వద్దామని చెప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు. తరువాత గోదా బాధితురాలిని చనిపోయే వరకు 49 సార్లు పొడిచి, మృతదేహాన్నిపొలంలో పడేశాడు. అనంతరం భువనేశ్వర్ తిరిగి వచ్చేసాడు. ఈ మృతదేహాన్ని చూసిన తర్వాత సూరత్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ధరించిన టీ-షర్టు ఆధారంగా విచారణ ప్రారంబించిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలో ఆరా తీశారు.చివరకు భువనేశ్వర్ లో గోదాను అరెస్టు చేశారు. ఈ నేరంలో ఇతరుల ప్రమేయం ఉందో లేదో తెలుసుకోవడానికి తదుపరి విచారణ కొనసాగుతోంది.

Exit mobile version