Gurgaon: కోట్లు విలువ చేసే కారు చిన్నప్రమాదానికే కాలి బూడిదైంది

హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో జరిగిన ఓ ప్రమాదం షాకింగ్ కు గురి చేస్తోంది. కోట్లు విలువ జేసే ఓ లగ్జరీ కారు చిన్న ప్రమాదంలోనే కాలి బూడిదైంది.

Gurgaon: హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో జరిగిన ఓ ప్రమాదం షాకింగ్ కు గురి చేస్తోంది. కోట్లు విలువ జేసే ఓ లగ్జరీ కారు చిన్న ప్రమాదంలోనే కాలి బూడిదైంది. చెట్టును ఢీకొన్న కారు పూర్తిగా కాలిపోయిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలేం జరిగిదంటే.. మన్ కీరత్ సింగ్(35) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున పోర్సె 911 లగ్జరీ స్పోర్ట్స్ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టాడు. దీంతో అకస్మాత్తుగా ఇంజిన్ లో నుంచి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మన్ కీరత్ త్రుటిలో తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని స్థానికంగా ఉన్న ప్రైవేటు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 

ఎక్కడికక్కడ విడిపోయిన భాగాలు(Gurgaon)

అయితే దాదాపు రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే పోర్సె స్పోర్ట్స్ కారు క్షణాల్లో కాలి బూడిదైంది. చెట్టును ఢీకొట్టడంతో కారు భాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లిపడ్డాయి. ఎక్కడి భాగాలు అక్కడే ఊడి పడ్డాయి. ఎదురుగా వచ్చిన కుక్కును తప్పించే బోయే క్రమంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టినట్టు తెలుస్తోంది. అతను గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్ పూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సోషల్ మీడిమాలో విపరీతంగా ట్రోలు చేస్తున్నారు నెటిజన్లు. అన్ని కోట్లు పెట్టి కారు కొంటే.. సేఫ్టీ ఇంతేనా అని కంపెనీని మీమ్స్ తో ఆటాడుకుంటున్నారు.