Site icon Prime9

Gang Rape : పెద్దపల్లి జిల్లాలో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం, హత్య

girl gang rape and murder in peddapalli district

girl gang rape and murder in peddapalli district

Gang Rape : దేశంలో మహిళలు, చిన్నారులపై దాడులు ఆగడం లేదు. వాటి నియంత్రణకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన.. మార్పు రావడం లేదు. అభంశుభం తెలియని చిన్నారులు పాలిట మృగాళ్లు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఎంత కఠినమైన.. పోక్సో, నిర్భయ వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధులు జంకడం లేదు. మహిళలు, చిన్నారులపై దేశవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట.. వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పెద్దపల్లి జిల్లా అప్పన్నపేటలో దారుణం జరిగింది.

ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు దుర్మార్గులు. మధ్యప్రదేశ్ కు చెందిన బాలికపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలైన బాలికను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందారు. బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

 

Minor gang-rape and murder

Exit mobile version
Skip to toolbar