Site icon Prime9

Gang Rape: హైదరాబాద్ లో దారుణం.. వివాహితపై కారులో గ్యాంగ్ రేప్

wife swapping game in Rajasthan

wife swapping game in Rajasthan

Gang Rape: మహిళలపై అత్యాచారల నివారణకు.. ఆడ పిల్లల రక్షణకు దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. వారిపై దాడులు ఆగడం లేదు. ఎన్ని కఠిన శిక్షలు విధించిన మానవ మృగాల్లో మార్పు రావడం లేదు. ఆడది ఒంటరిగా కనిపించిందటే చాలు.. వారిని వేధించడమో.. లేదా వారిపై అత్యాచారం చేయడమో చేస్తున్నారు. తాజాగా ఓ వివాహితను కారులో తిప్పుతూ గ్యాంగ్ రేప్ చేసిన ఘటన.. కలకలం రేపుతోంది. దారిదోపిడి దొంగలు.. మహిళను కారులో ఎక్కించుకొని మద్యాం తాపించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

వివాహితపై గ్యాంగ్ రేప్.. నగలు దోపిడి (Gang Rape)

దారిదోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. ఇది వరకు.. దోపిడికే పరిమితమైన వారు.. ప్రస్తుతం అత్యాచారలకు పాల్పడుతున్నారు. డబ్బులు, నగలు దోచుకోవడంతోపాటు ఒంటరి మహిళలపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలోని నార్సింగీలో చోటుచేసుకుంది. ఓ వివాహితపై జరిగిన అత్యాచారం.. నగరం ఉలిక్కి పడేలా చేసింది. ఈ ఘటనతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా నార్సింగ్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండుగులు ఓ వివాహిత మహిళపై చేసిన అత్యాచారం పోలీసులకు ఇపుడు సవాల్ గా మారింది. పీరం చెరువు గ్రామం వద్ద ఒంటరిగా.. ఓ వివాహిత కనిపించడంతో ఆ ముఠా అక్కడికి చేరుకున్నారు. మహిళ ఒక్కరే ఉండడం గమనించి.. ఆమె వద్దనున్న బంగారాన్ని చోరీ చేద్దామనుకున్నారు. కానీ ఆ ముఠా.. ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసేందుకు ప్లాన్‌ వేశారు. ఆమె వద్ద ఎవరూ లేకపోవడంతో.. బలవంతంగా కారులో ఎక్కించుకొని కిస్మత్ పూర్ వైపు తీసుకెళ్లారు. కారులోనే ఆమెను బెదిరించి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. మహిళ వద్ద ఉన్న.. మొబైల్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేశారు. మహిళను మద్యం తాగాలని బలవంతం చేయడంతో.. ఆమె ఒప్పుకోలేదు. దీంతో దుండగులు బలవంతంగా మద్యం తాగించారు. ఆ తర్వాత మత్తులోకి వెళ్లిన వివాహితపై.. దుండగులు ఒకరి తర్వాత మరొకరు ఆత్యాచారానికి పాల్పడ్డారు.

కారులో తిప్పుతు గ్యాంగ్ రేప్

కారు ఒకే చోట ఉంటే అనుమానం వస్తుందని భావించిన దుండగలు.. కారును తిప్పుతూ అందులోనే అత్యాచారం చేశారు. అర్థరాత్రి అయినా.. ఆమహిళ మత్తులోనే ఉండటంతో.. గండిపేట వద్ద వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొన్ని గంటల తర్వాత.. మత్తులో నుండి కొలుకున్న వివాహిత తాను ఎక్కడుందో తెలుసుకొని తన భర్తకు సమాచారం అందించింది. ఘటన స్థలానికి చేరుకున్న భర్త.. లేవలేని స్థితిలో ఉన్న భార్యను ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ తనపై జరిగిన ఘోరాన్ని భర్తకు వివరించింది. వెంటనే.. వివాహిత భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు డిమాండ్ చేసింది. సీసీ టీవీల ఆధారంగా.. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

ఇద్దరు నిందితుల అరెస్ట్..

వివాహితపై అత్యాచారం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాచుపల్లికి చెందిన కారు డ్రైవర్లు.. శుభం శర్మ, సుమిత్ శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Exit mobile version