Suicide:హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. హైదరాబాద్ లోని తార్నాకలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో ఓ చిన్నారి ఉండటం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
ఆత్మహత్యకు కారణం ఇదే..
ఈ ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు.
తార్నాకలో నివాసం ఉంటున్న విజయ్ ప్రతాప్, సింధూర దంపతులు.
వీరికి నాలుగేళ్ల పాప ఆద్య ఉంది. వీరితో పాటు ప్రతాప్ తల్లి జయతి ఇక్కడే ఉంటోంది.
ఇక భార్యభర్తలు ఇద్దరు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. కానీ చిన్న చిన్న కలతలు చిచ్చురేపాయి.
ఇంతలో ఏం జరిగిందో.. కుటుంబంలో నలుగురు ఆత్యహత్య చేసుకున్నారు.
చెన్నైకి చెందిన విజయ్‌ప్రతాప్ కి సింధూరకు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.
ప్రతాప్ చెన్నైలోని కార్ల కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నారు.
సింధూర ఓ ప్రముఖ బ్యాంక్ మేనేజర్ గా హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా తార్నాకలో నివాసం ఉంటున్నారు.
సెలవు రోజుల్లో చైన్నై నుంచి ప్రతాప్ హైదరాబాద్ కు వచ్చేవారు.
ఈ మధ్యనే ప్రమోషన్ తో పాటు జీతం పెరగడంతో.. కుటుంబం మెుత్తం చైన్నె వెళ్లిపోదామని ప్రతాప్ ఒత్తడి చేసినట్లు సమాచారం.
ఇక్కడే మంచి ఉద్యోగం ఉండటం.. తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉండటంతో మరికొన్ని రోజులు ఉందామంటూ సింధూర చెప్పేవారు.
ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.
సంక్రాంతి సెలవులపై వచ్చిన ప్రతాప్.. చైన్నై వెళ్దామంటూ మరోసారి ఒత్తిడి తెచ్చారు.
ఆదివారం అత్తవారింటి నుంచి వచ్చిన కాసేపటికే వీరు తాము ఉంటున్న ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మరుసటి రోజు ప్రతాప్‌కు ఫోన్ చేసినా స్పందించకపోవటంతో.. నేరుగా ఇంటికి వచ్చారు.
లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు బద్దలుకొట్టి చూడగా అప్పటికే మృతిచెంది కనిపించారు.
ప్రతాప్ ఫ్యాన్ కు ఉరి వేసుకోగా.. సింధూర, ఆద్య, జయతి నేలపై పడి ఉన్నారు.
వెంటనే ఓయూ పోలీసులకు సమాచారం అందించగా.. క్లూస్ టీం సహాయంతో వారు వివరాలను సేకరించారు.
పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/