Former MPTC Murder: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యాడు. అక్రమ సంబంధమే హత్యకు దారితీసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది. 42ఏళ్ల మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ ను నిందితులు చంపేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో చంపి పాతి పెట్టినట్లు పోలీసుల విచారణలో తెలిపినట్లు సమాచారం.
17న పోలీసులకు ఫిర్యాదు..(Former MPTC Murder)
మహేష్ కనిపించకపోవడంతో ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితులు గడ్డం మహేష్ ను హత్య చేసి ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పాతి పెట్టినట్లు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి చిన్న, పరమేష్ అనే వ్యక్తులతో పాటు మరో ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నారు. మహేష్ మృతదేహం కోసం ఘట్కేసర్ డంపింగ్ యార్డ్ లో పోలీసులు గాలింపు చేపట్టారు.