Site icon Prime9

Hyderabad Police: ట్విన్ సిటీస్ లో భారీగా పెరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు…

Drunk and drive cases increased in Twin Cities

Drunk and drive cases increased in Twin Cities

Drunk and Drive: భాగ్యనగరంలో విచ్చల విడిగా మద్యం తాగి వాహనాలు నడిపేస్తున్నారు. పాదచారులు, వాహనదారులకు ఇబ్బందికరంగా మారుతున్నారు. పోలీసు ఆంక్షలు, తనిఖీలు చేపడుతున్నా, మద్యం తాగి పట్టుబడి వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా గత నెల సెప్టెంబర్ లో మద్యం తాగి వాహనాలు నడిపుతూ 3834 మంది పోలీసులకు పట్టుబడ్డారు.

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్ నెలలో మొత్తం 4332 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో 3834 మద్యం తాగి వాహనాలు నడిపిన వారుండగా, డ్రైవింగ్ లైసెన్సు లేకుండా 479మంది, మైనర్లు వాహనాలు నడుపుతూ 18మంది పట్టుబడిన వారిలో ఉన్నారు. మద్యం తాగి పట్టబడ్డ వారికి న్యాయస్థానం కోటీ 21 లక్షల 91వేల 100 రూపాయలను జరిమానా విధించింది. అధిక శాతంలో సేవించిన వారి సంఖ్యను బట్టి 14మందికి 1రోజు, 18 మందికి 2రోజులు, 37మందికి 3రోజులు, 11మందికి 4 రోజులు, 4గురికి 5రోజుల జైలు శిక్షను విధిస్తూ న్యాయస్ధానం తీర్పు చెప్పింది.

మద్యం మీద వచ్చే ఆదాయంతో ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి మెరుగ్గా ఉండడంతో నగరంలో విచ్చల విడిగా మద్యం లభ్యమవుతుంది. అధికారిక వేళలకు మించి మరీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. పలు ప్రాంతాలతో పాటు హైదరాబాదుకు ఎంతో కీలకమైన హైటెక్ సిటీ ప్రాంతాల్లో దొంగచాటుగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఇదంతా కూడా పోలీసులకు తెలిసే జరుగుతుంది.

శుక్ర, శని, ఆదివారాల్లో పోలీసుల తనిఖీలు లేకుండా పాన్ షాపులు, మద్యం షాపులు అనధికారికంగా విక్రయాలు సాగిస్తున్నారు. పాన్, గుట్కా, విదేశీ సిగిరెట్లు ఒక్కటేంటి నిషేదిత అన్ని వస్తువులు హైటెక్ సిటీ ప్రాంగణంలో లభిస్తాయి. ఇందుకోసం ఒక్కొక్క దుకాణాదారుడు వారానికి రూ. 600 నుండి వెయ్యి రూపాయల వరకు పోలీసులకు సమర్పించుకొంటున్నారు. ఇదంతా నెలవారీ మామూళ్లకు సంబంధం లేకుండానే. ఒక బీరు బాటిళ్ కు రూ. 20 అదనంగా చెల్లిస్తే రాత్రి వేళల్లో ఇట్టే దొరికిపోతుంది. ఇక సరుకును బట్టి అధిక మొత్తాన్ని వసూలు చేస్తుంటారు. ఇలా దొరుకుతున్న మద్యాన్ని తాగి విచ్చలవిడిగా వాహనాల్లో తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కల్గిస్తున్నారు. అడప దడపా పోలీసులకు చిక్కి కటాకటాల పాలౌతున్నారు.

ఇది కూడా చదవండి:Gold Seized: శంషాబాద్ విమానాశ్రయంలో 7.69 కేజీల బంగారం పట్టివేత

Exit mobile version