Site icon Prime9

Murugha Mutt: బాలికలకు మత్తు మందిచ్చి అత్యాచారాలు.. మురుగ మఠం పీఠాధిపతి పై పోలీసుల చార్జిషీటు

Muruga Math

Muruga Math

Karnataka: పండ్లు, డ్రింక్స్‌తో మత్తుమందులు లేదా కొన్ని మత్తుపదార్థాలు కలిపి మురుగ మఠంపాఠశాలలో చదువుతున్న బాలికలను పీఠాదిపతి బెడ్‌రూమ్‌కు పంపించారు అంటూ ఈ చిత్రదుర్గ పోలీసులు చార్జిషీటు దాఖలు చేసారు. మైనర్ బాలికల పై అత్యాచారాలు జరిగాయన్న నేపధ్యంలో పోలీసులు దీనిపై దర్యాప్తు చేసారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం మైనర్ బాలికల స్టేట్‌మెంట్‌లను నమోదు చేసుకున్నారు. ఈ సెక్షన్ కింద మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలాలు కీలక సాక్ష్యంగా పరిగణించబడతాయి. మత్తు మందు ఇచ్చిన తర్వాత తమను వార్డెన్ బాత్‌రూమ్‌కి, ఆఫీసుకు కూడా పంపించారని బాలికలు తెలిపారు. ప్రతిఘటిస్తే వార్డెన్ వేధించేవాడని, శిక్షించేవాడని ఆరోపించారు.

పండ్లు, మత్తుమందులు కలిపిన చాక్లెట్లు..

పండ్లు మరియు చాక్లెట్లు తిని తాము రాత్రిపూట పీఠాధిపతి గదిలో ఉండవలసి వచ్చిందని వారు చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఉదయం పూట తిరిగి డార్మెటరీకి వెళ్లే సరికి నిద్రమత్తుగా ఉంటుంది. శరీరంలోని వివిధ భాగాలు మరియు ప్రైవేట్ భాగాలలో తీవ్రమైన నొప్పి ఉండేదని వారు ఫిర్యాదు చేశారని బాలికలు మహిళా కమీషన్ ను ఆశ్రయించడంలో సహాయపడిన ఓడనాడి స్వచ్చంద సంస్ద డైరెక్టర్ స్టాన్లీ చెప్పారు.

‘అసహజ మరణం’..
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక మృతి చెందడం పై అనుమానాలను కూడా చార్జ్ షీట్‌లో ప్రస్తావించారు. హాస్టల్‌లో ఉన్న బాలికను సంఘటన జరగడానికి కొద్ది రోజుల ముందు మఠం నుండి పంపించారు. బాలిక తండ్రి దృష్టి లోపం ఉన్నందున ఆమె హాస్టల్‌లో ఉండిపోయింది. మఠం అమ్మాయిని చూసుకోలేకపోతే, విధానాన్ని అనుసరించకుండా ఆమెను ఇంటికి పంపించారు. దీనిపై విచారణ జరగాలని స్టాన్లీ అన్నారు. బాలిక మరణం అసహజంగా నమోదు చేసి, రైల్వే పోలీసులు కేసును మూసివేసినట్లు చిత్రదుర్గ పోలీసులు తెలిపారు.

మరోవైపు మురుగ మఠం పగ్గాలు చేపట్టాలని దీనికి పాలనాధికారిని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. మేము డిసి నుండి నివేదిక కోరాము, నివేదికను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము” అని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు. శివమూర్తి మురుగ శరణారావును మఠం చీఫ్‌గా తొలగించాలని ఒత్తిడి పెరుగుతోంది.

Exit mobile version