Site icon Prime9

Medak: ఇన్స్యూరెన్స్ కోసమే చనిపోయినట్టు డ్రామా.. మెదక్ లో వెలుగు చూసిన ట్విస్ట్

medak

medak

Medak: మెదక్ లో ఓ వ్యక్తి బీమా డబ్బుల కోసం ఆడిన డ్రామాను చూసి పోలీసులు కంగుతిన్నారు. చనిపోయాడు అనుకున్న వ్యక్తి గోవాలో ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వ్యక్తి సజీవదహనం కేసు కీలక మలుపు తిరిగింది. బీమా డబ్బుల కోసమే డ్రైవర్‌ను వ్యక్తి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

మెదక్‌ జిల్లా టేక్మాల్ మండలం వెంకటాపురంలో వ్యక్తి  సజీవ దహనం కేసు కలకలం రేపింది. ఈ నెల 9న వెంకటాపురం వద్ద ఓ వ్యక్తి కారులో సజీవ దహనం అయ్యాడు. మెుదటగా ఈ ప్రమాదంలో మృతి చెందింది భీమ్లా తండాకు చెందిన ధర్మగా పోలీసులు గుర్తించారు. ధర్మా హైదరాబాద్ సెక్రటేరియెట్ లో సీనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనలో పోలీసులు కీలక ఆధారాన్ని సేకరించారు. ప్రమాద స్థలంలో పెట్రోల్ సీసా దొరకడంతో ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు.

ఈ ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు.. కీలక విషయాలను రాబట్టారు.

చనిపోయాడనుకున్న వ్యక్తి ఫోన్ సిగ్నల్స్ పని చేయడంతో అతడు ఇంకా బతికే ఉన్నాడని నిర్ధారించారు. సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. గోవా నుంచి నిందితుడిని తీసుకువచ్చి విచారించగా.. విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.

ఈ ప్రమాదంలో చనిపోయింది ధర్మ కాదని.. కారు డ్రైవర్ అని పోలీసులు గుర్తించారు.

ధర్మ బెట్టింగ్‌లు, జూదం ఆడి అప్పులు చేశాడని.. బీమా డబ్బుల కోసమే ఈ డ్రామా ఆడినట్లు పోలీసులు తెలిపారు.

ఆ డబ్బులు వస్తే అప్పులు తీర్చాలని ధర్మ భావించారు. డ్రైవర్‌ను హత్య చేసి పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టినట్లు నిందితుడు తెలిపాడు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version