Rape on Disabled woman: కామంతో కళ్లు మూసుకుపోయిన యువకులు ఓ దివ్యంగరాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు . కృష్ణాజిల్లా కంకిపాడులో ఈ దారుణం వెలుగుచూసింది.కంకిపాడు మండలం లోని దావులూరులో ముగ్గురు యువ మృగాళ్లు 26 ఏళ్ల వయసున్న ఓ దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు గత వారం రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది.ఈ నేపథ్యంలో హాస్పిటల్‌కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె రెండు నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఈ దారుణంపై బాధితురాలి తల్లి కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సొంత ఊరివాళ్ళే..(Rape on Disabled woman)
అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కొంత కాలంగా దివ్యాంగురాలిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్లు సమాచారం .పోలీస్ కేసు నమోదు చేసిన తర్వాత యువకులు గ్రామం విడిచి పరారు లో ఉన్నట్లు తెలుస్తోంది .ఒక వైపు సాధారణ మహిళలపై జరుగుతున్న దారుణాలు వణుకుపుట్టిస్తున్నాయి. మరో వైపు దివ్యాంగులు పై జరుగుతున్న అఘాయిత్యాలు చూస్తుంటే మనస్సు చలించివేస్తోంది .ఇలాంటి దారుణాలకు ఒడికట్టిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు .తరుచు జరిగి ఇలాంటి సంఘటనలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొత్తగా ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడకపోవడం ఆందోళనలకు గురిచేస్తోంది.