Site icon Prime9

Crime News : గుంటూరు లో షాకింగ్ ఘటన.. దూరం పెడుతున్నాడని సహజీవనం చేసిన యువకుడిపై మహిళ యాసిడ్ దాడి

crime news about women acid attack on young man in guntur

crime news about women acid attack on young man in guntur

Crime News : గుంటూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గతంలో తనతో సహజీవనం చేసిన యువకుడు.. ఇప్పుడు దూరం పెడుతున్నాడనే కోపంతో మరో ముగ్గురితో అతనిపై దాడి చేసి యాసిడ్ పోసిన ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆ యువకుడు తీవ్ర గాయాలతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా ప్రాంతానికి చెందిన రాధకు గతంలోనే వివాహమైంది. కానీ భర్త లేడు. దీంతో ఆమె గుంటూరులోని రామిరెడ్డి తోటలో నివసిస్తూ జీవనోపాధి కోసం స్థానికంగా ఉండే ఇళ్లలో పని చేస్తూ ఉంటుంది. స్థానికంగా ఓ వాటర్ ప్లాంట్ లో ఓర్పు వెంకటేష్ అనే యువకుడు పని చేస్తున్నాడు. ప్రతీ రోజూ వాటర్ ప్లాంట్ ను నుంచి వాటర్ క్యాన్ లను తీసుకెళ్లి చేరే వేసే పని ఆ యువకుడిది.

ఈ క్రమంలోనే రాధకు.. వెంకటేష్ తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో రాధను ఆ యువకుడు మూడు నెలల కిందట తన నివాసానికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి వారిద్దరూ అక్కడే ఉంటున్నారు. అయితే ఆ మహిళను ఇంటికి తీసుకురావడం వెంకటేష్ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో ఆమెను ఇంట్లో నుంచి పంపించారు. దీంతో ఆగ్రహం చెందిన రాధ.. వెంకటేష్, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేశారని ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ యువకుడిపై అలాగే మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు

ఐడీ జరిగి కొద్ది రోజులు గడిచినప్పటికీ తనని దూరం పెట్టాడనే  కోపంతో రాధ.. వెంకటేష్ పై పగ తేర్చుకోవాలని భావించింది. ఈ మేరకు మంగళవారం నాడు ముగ్గురు యువకులను తీసుకొని వెంకటేష్ ఉండే చోటుకి వెళ్ళి  అతనిపై యాసిడ్ పోసింది. అనంతరం ఆ ముగ్గురు యువకులతో పాటు ఆటోలో పారిపోయింది. అయితే ఈ ఘటనను స్థానికులు గమనించి అతడిని జీజీహెచ్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Exit mobile version