Crime News : ప్రస్తుత కాలంలో సభ్యసమాజం సైతం తలదించుకునేలా దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాల ముసుగులో మనుషులు సిగ్గుమాలిన చర్యలకు దిగజరుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్తనో.. భార్యనో.. ప్రియుడినో.. మిగతా వారు హతమార్చడం. లేదా వారి బంధానికి అడ్డుగా ఉన్నారని పిల్లలను కూడా చంపిన వారి గురించి వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఏపీ లోని తిరుపతిలో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేస్తుంది.
పట్టణానికి చెందిన ఒక వ్యక్తి భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం తెలుసుకున్న ఆమె పద్ధతి మార్చుకోమని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ వారిలో మార్పు రాలేదు. దీంతో ఆమెను పుట్టింటికి వెళ్లిపోమని చెప్పాడు. కానీ సదరు మహిళా పుట్టింటికి వెళ్ళకుండా అ వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తితో కలిసి ఉంటుంది. విషయం తెలుసుకున్న భారత వారి గురించి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. అలా చేయడం వల్ల అయినా వారిలో మార్పు వస్తుంది అనుకుంటే.. ఆ ప్రియుడు మాత్రం ఆ ఘటనతో కోపంతో రగిలిపోయిఆ భర్త మీద ప్రతీకార చర్యకు దిగాడు. ఆ భర్తకి శిరోమండనం చేయించడమే కాకుండా.. అతని మీద మూత్రం పోసి వీడియోలు తీసుకున్నాడు. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే (Crime News) ..
స్థానికుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ఏ.రంగంపేటకు చెందిన బాధితుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన ఓ మహిళను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆటో యజమాని తిరుపతి రూరల్ మండలం, ముస్లింపేటకు చెందిన యువకుడు బాధితుడి ఇంటి వద్దకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. అదే సమయంలో బాధితుడి భార్యతో.. ఆ యువకుడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే ఈ విషయాన్ని చుట్టు పక్కల వాళ్లకు వంశీకి తెలియజేయడంతో.. భార్యను నిలదీశాడు. దీంతో అతని భార్య రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోతున్నానని చెప్పి ప్రియుడు చెంతకు చేరింది.
అయితే తన భార్య ప్రియుడు తోనే ఉన్నట్లు గుర్తించి గత నెల 13వ తేదీన తన భార్యతో పాటు ఆ ప్రియుడు కూడా చనిపోయాడంటూ ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేశాడు. దీన్ని జీర్ణించుకోలేని ఆ ప్రియుడు.. తన స్నేహితుడుతో కలిసి బెంగళూరులో ఉంటున్న బాధితుడిని కిడ్నాప్ చేసి చంద్రగిరికి తీసుకొచ్చారు. కొంతమంది స్నేహితులతో కలిసి అక్కడ బాధితుడిని చిత్ర హింసలకు గురి చేసి .. సైలెన్సర్ తో శరీరం అంతా కాల్చారు. ఆపై తలపై మూత్రం పోశారు. అంతటితో ఆగకుండా బాధితుడికి గుండు కొట్టించి వీడియోలు చిత్రీకరించారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.
చివరికి ఈ విషయం పోలీసుల దాకా చేరింది. వెంటనే దీనిమీద దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని నిర్ధారించుకున్నారు. దీంతో ఆ ప్రియుడిని, అతనికి సహకరించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అవమానం భరించలేక బాధితుడు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/