Site icon Prime9

Acid Attack : ఏలూరులో దారుణ ఘటన.. వివాహితపై యాసిడ్ దాడి.. ఇప్పుడు ఎలా ఉందంటే?

crime news about acid attack on women in eluru

crime news about acid attack on women in eluru

Acid Attack : ఏపీ లోని ఏలూరులో జరిగిన ఓ దారుణ ఘటన ఇప్పుడు ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.  మంగళవారం రాత్రి ఓ మహిళ మీద ఇద్దరు దుండగులు యాసిడ్ దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. ఈ దాడిలో ఆమె తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు. కాగా ఈ దాడిలో ఆమె కంటిచూపు కోల్పోయినట్లు సమాచారం అందుతుంది.

ఈ సంఘటనలో పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఏలూరు స్థానిక జేవియర్ నగర్ లో ఎడ్ల ఫ్రాన్సిక నివాసం ఉంటుంది. దుగ్గిరాల సమీపంలోని డెంటల్ కాలేజీలో ఆమె రిసెప్షనిస్ట్ గా పని చేస్తుంది. ఆమె భర్త రాజ మహేంద్రవరంలో కెమికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. వీరిద్దరిది ప్రేమ వివాహం. అయితే, పెళ్లైన కొద్ది రోజులకి విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. రెండేళ్లుగా వేరుగా ఉంటున్నారు. విడిపోయిన తర్వాత ఫ్రాన్సిక తన తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. మంగళవారం రాత్రి డ్యూటీ అయిపోయిన తర్వాత టూ వీలర్ మీద ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు ఆమె మీద యాసిడ్ దాడి చేశారు.

వెంటనే పరుగులు తీస్తూ ఇంట్లోకి వెళ్లింది ఫ్రాన్సిక. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడితో బాధితురాలు కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఓ వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన వాడని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి ఆసుపత్రికి వచ్చి బాధితులని పరామర్శించారు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. దాడికి పాల్పడిన నిందితుల కోసం గాలిస్తున్నామని.. వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

Exit mobile version