Site icon Prime9

Chennai: క్లాస్‌మేటే కాలయముడిగా మారి.. చెన్నైలో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ దారుణ హత్య.

.Chennai

.Chennai

Chennai: తమిళనాడులో 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నులింగమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న ఆమె మాజీ క్లాస్‌మేట్ ఆమెను గొలుసుతో కట్టి, బ్లేడ్‌తో గాయపరిచి సజీవ దహనం చేసిందని పోలీసులు తెలిపారు.చెన్నైలోని కేలంబాక్కం సమీపంలోని తలంబూర్‌లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని..(Chennai)

మధురైకి చెందిన నందిని చెన్నైలో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ బంధువుల ఇంట్లో ఉంటోంది. నందిని, పాండి మహేశ్వరి (వెట్రిమారన్ అసలు పేరు) చిన్ననాటి స్నేహితులు. చిన్నప్పటి నుంచి సన్నిహితంగా ఉండటంతో ఆమెపై ఇష్టం పెంచుకున్న మహేశ్వరి లింగమార్పిడి చేయించుకుని వెట్రిమారన్ గా మారింది. వీరిద్దరు కలిసి చెన్నైలో కొంతకాలం సహజీవనం చేసారు. వారిద్దరూ తోరైపాక్కంలోని ఓ ప్రైవేట్ ఐటీ సంస్థలో కలిసి పనిచేశారు. అయితే గత కొంతకాలంగా నందిని వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని వెట్రిమారన్ అనుమానించాడు. దీనితో పధకం ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. తన బర్త్ డే అని తనతో కొంత సమయం గడపాలని కోరడంతో అంగీకరించి నందిని అతనితో వెళ్లింది.కొద్దిసేపు సరదాగా గడిపాక అమెను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి గొలుసులతో బంధించాడు. అనంతరం బ్లేడ్ తో ఆమె మెడ, చేతులను గాయపరిచి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. అటుగా వెడుతున్న కొంతమంది మంటల్లో కాలిపోతున్న ఆమెను చూసి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి వెట్రిమారన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302  కింద కేసు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండుకు తరలించారు.

Exit mobile version