Bengaluru: మెట్రోపాలిటన్ సిటీ బెంగళూరు నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. నగరంలోని ఓ పార్క్ లో ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్న యువతిని నలుగురు యువకులు బలవంతంగా కారులోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మార్చి 25 న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
బలవంతంగా కారులోకి ఎక్కించి(Bengaluru)
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం ఓ యువతి కోరమంగళ ఏరియాలోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్క్ దగ్గర స్నేహితుడితో మాట్లాడుతోంది. అక్కడికి వచ్చిన నలుగురు యువకులు .. ఈ సమయంలో పార్కులో ఏం చేస్తున్నారంటూ బెదిరించాడు. దాంతో బయపడిన ఆమె ఫ్రెండ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం నలుగురు యువకులు.. యువతిని బలవంతంగా కారులోకి ఎక్కించి తీసుకెళ్లారు. ఆ తర్వాత నగర వీధుల్లో తిరుగుతూ కదులుతున్న కారులోనే యువతిపై సాముహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నగరంలోని ఇందిరానగర్, దోమ్లూర్, అనేకల్ మీదుగా వారి వాహనం వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం మరుసటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు యువతి ఇంటి సమీపంలో వదిలి వెళ్లారు. అంతేకాకుండా జరిగిన విషయాన్ని ఎవరికైనా చెప్పినా.. పోలీసులకు సమాచారం అందించినా చంపేస్తామని బెదిరించారు.
నిందితుల అరెస్టు
అయితే యువతి ఆరోగ్యం పరిస్థితి చూసిన కుటుంబసభ్యులు ఆమెను హాస్పిటల్ కు తరలించారు. ఈ క్రమంలో తనకు జరిగిన అన్యాయం గురించి యువతి కుటుంబ సభ్యులకు తెలిపడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నలుగురు యువకులని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నగరంలోని ఇజీపురాకు చెందిన సతీశ్, విజయ్, కిరణ్, విజయ్ లను అరెస్టు చేశారు. నిందితుల వయస్సు 22 నుంచి 26 ఏళ్ల లోపే ఉంటుందని పోలీసులు తెలిపారు.