Hyderabad: హైదరాబాద్ శివార్లలోని ఎల్‌బి నగర్ పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. రెండేళ్ళుగా ఆర్టీసీ కాలనీలో హోమియోపతి వైద్యురాలు సంఘవి, ఆమె తమ్ముడు పృథ్వీ ఉంటున్నారు. ఆర్టీసీ కాలనీలో ఇంట్లో ఉన్న అక్కా తమ్ముడిపై ఈ మధ్యాహ్నం రామాంతాపూర్‌కి చెందిన శివకుమార్ కత్తితో దాడి చేసి పొడిచాడు.
చికిత్స పొందుతూ మరణించిన తమ్ముడు..(Hyderabad)
శివకుమార్ పొడవగానే చింటూ బయటకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరికీ విషయం చెప్పాడు. దీంతో చుట్టు పక్కల ఉన్నవారు దాడి జరిగిన ఇంటి వద్దకి చేరుకున్నారు. సంఘవిని అందరూ కలిసి బయటికి తెచ్చారు. వెంటనే ఇంటి తలుపులకి బయటినుంచి గొళ్ళెం పెట్టి పోలీసులకి సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు శివకుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన అక్క సంఘవి, తమ్ముడు పృథ్వీని ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పృథ్వీ మరణించాడు. సంఘవి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కొంతకాలంగా సంఘవి- శివకుమార్ మధ్య ప్రేమ వ్యవహారం జరుగుతోందని, పెళ్ళి విషయం మాట్లాడేందుకు వచ్చిన శివకుమార్ ఆగ్రహానికి లోనై అక్క, తమ్ముడిని కత్తితో పొడిచాడని సమాచారం.