Atm Theft: జగిత్యాల జిల్లాలో ఏటీఎం చోరీ.. రోడ్డంతా డబ్బులే!

Atm Theft: జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. జిల్లాలోని కోరుట్ల పట్టణంలో ఏటీఎం (Atm Theft) పగలగొట్టి చోరీకి యత్నించారు. ఈ చోరీలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు పోలీసులు
ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల నుంచి డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారిని మాత్రం పట్టుకోలేకపోయారు.

నేరాల నియంత్రణకు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న కొందరిలో మార్పు రావడం లేదు. అత్యాశకు పోయి జైలు పాలవుతున్న వారిలో మార్పు రావడం లేదు. ఒక్క దెబ్బతో లైఫ్ సెటిల్ అవ్వాలని
కొందరు బ్యాంకులకు ఏటీఎంలకు కన్నం వేస్తున్నారు. అలాంటి ఘటనే ఇప్పుడు కోరుట్లలో చోటుచేసుకుంది.

కోరుట్ల పట్టణంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ చేసేందుకు నలుగులు నిందితులు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ఏటీఎం ప్రత్యేక నిఘా విభాగం కనిపెట్టింది. వెంటనే హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ని అప్రమత్తం చేయడంతో డబ్బు చోరికి గురికాకుండా ఉంది. అప్రమత్తమైన హెడ్ ఆఫీస్ అధికారులు.. సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. పెట్రోలింగ్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

చోరీకి యత్నించిన నిందితుల వాహనాన్ని పోలీసుల వాహనం ఢీ కొట్టింది.

ఈ క్రమంలో నిందితులు ఎత్తుకెళ్తున్న నోట్ల కట్టలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.

నిందితులు మాత్రం కారులో అక్కడి నుంచి పరారయ్యారు. రోడ్డుపై పడిన మెుత్తాన్ని లెక్కించగా రూ. 19 లక్షలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ..

ఏటీఎంలో డబ్బు చోరీకి గురికాకుండా కాపాడిన బ్లూ కోల్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించారు.

రూ. 19 లక్షలను స్వాధీనం చేసుకున్న హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్, డ్రైవర్ ను ప్రశంసించారు.

ధైర్యంగా నిందితులకు ఎదురెళ్లారని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/