Site icon Prime9

Ap Volunteer : వివాహితను 20 రోజులుగా బంధించి అత్యాచారానికి పాల్పడుతున్న వాలంటీర్.. ఎక్కడంటే ?

Ap Volunteer locked married women for 20 days in a room and raped her

Ap Volunteer locked married women for 20 days in a room and raped her

Ap Volunteer : ఏపీలో వాలంటీర్ల ఘాతుకాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఇప్పటికే వాలంటీర్‌ వ్యవస్థపై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు వాలంటీర్లు చేసన ఆరుణ ఘటనలు ఇటీవలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి రావడం గమనించవచ్చు. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వివాహితను బెదిరించి బలవంతంగా ఓ గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో బయటపడింది. ఈ అమానుష విషయంలో బాధితురాలు కన్న కూతురు ఎదుటే ఆమెపై తన కామ వాంఛ తీర్చుకున్నాడు ఆ దుండగుడు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.

ఈ ఘటనలో పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికి మండలం లోని ఓ గ్రామంలో ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అయితే జీవనోపాధి కోసం యాడికి లోని ఓ బట్టల దుకాణంలో పని చేస్తుంది. కాగా అదే మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన దాసరి సతీశ్.. గ్రామ వాలంటీర్ గా పని చేస్తున్నారు. గత మూడు నెలలుగా ఆ వివాహిత ఇంటికి తరచూ వెళ్తూ వస్తున్న క్రమంలో సతీష్ కి సదరు వివాహితతో పరిచయం ఎక్కువైంది.

ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ నెల 7వ తేదీన ఆ వివాహిత బట్టల దుకాణంలో పని చేసేందుకు తన ఆరేళ్ల కూతురును తీసుకొని వెళ్ళింది. ఆ సమయంలోనే సతీష్.. అక్కడికి వచ్చి ఆ వివాహితతో తన కోరికను తీర్చాలని మనసులోని మాట బయటపెట్టాడు. లేకపోతే భర్త పిల్లలను హతమారుస్తానని హెచ్చరించాడు. ఆ తర్వాత తాను తీసుకువచ్చిన కారులో.. ఆమెను, ఆరేళ్ల చిన్నారిని బలవంతంగా ఎక్కించుకుని స్థానికంగా ఉన్న తన రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు.

ఆ తర్వాత అఆ రూమ్ లోనే వివాహితపై రెండు రోజుల పాటు లైంగిక దాడికి ఒడిగట్టాడు. అనంతరం కార్ ను రెంట్ కు తీసుకుని ఈ నెల 9వ తేదీన తిరుపతికి వెళ్లాడు. అక్కడ గదిని అద్దెకు తీసుకొని వారితో పాటు ఉన్నాడు. ఇక ఆ రూమ్ లోనే వివాహిత కుమార్తె అయిన ఆరేళ్ల చిన్నారి ఎదుటే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి బాధితురాలు తప్పించుకుందామని అనుకున్నా.. అందుకు వీలు లేకుండా బయటకు వెళ్లేటప్పుడు తాళం వేసేవాడని బాధితురాలు వాపోయింది.

ఇక మరో వైపు 7 వ తేదీ నుంచి వివాహిత, చిన్నారి కనిపించకుండా పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ తర్వాత వారి ఆచూకీ తెలియకపోవడంతో ఈ నెల 11న యాడికి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో తిరుపతి పోలీసుల సాయంతో బాధితురాలిని ఈ నెల 25వ తేదీన విముక్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో మరికొన్ని విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Exit mobile version