Anakapalle: అనకాపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడవలి రామకృష్ణ, భార్యతో పాటు, పిల్లలు వేద వైష్ణవి, జాన్వి లక్ష్మి మృతి చెందగా.. కుసుమ అనే మరో తొమ్మిదేళ్ల చిన్నారి ఎన్టీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా బంధువులు చెబుతున్నారు.
అప్పుల కారణంగా..(Anakapalle)
గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివరామకృష్ణ స్వర్ణకారుడని ప్రాథమిక విచారణలో తేలింది. గత కొన్ని నెలలుగా కుటుంబంతో సహా అనకాపల్లిలో ఉంటున్నాడు. అప్పుల కారణంగా శివరామకృష్ణ కుటుంబం తీవ్ర అవస్థలు పడి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. మృతులను పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.
https://youtu.be/ob0bA4bDLjA?si=lyY96LH7G1DYSG3M