Site icon Prime9

Heroin Seized: 35కోట్ల హెరాయిన్ పట్టివేత

35 crore heroin seized

Mumbai: నైరోబి నుండి భారత్ లోకి మాదకద్రవ్యాలు తరలిస్తూ ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. అతని నుండి 35 కోట్లు విలువచేసే హెరాయిన్ ను స్వాధీనం చేసుకొన్నారు. ఈ ఘటన ముంబై ఎయిర్ పోర్టులో చోటుచేసుకొనింది.

సమాచారం మేరకు, మహారాష్ట్రలో ముంబైకి చెందిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులకు నైరోబి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి తీరు అనుమానాస్పదంగా కనిపించింది. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. నిందితుడి లగేజీని తనిఖీ చేయగా అతని దగ్గర 4.98 కిలోల హెరాయిన్‌ లభ్యమైంది. దాంతో అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, హెరాయిన్‌ను సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకొన్న హెరాయిన్‌ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో దాదాపు రూ.35 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు అంచనా వేశారు.

ఇది కూడా చదవం: Bengaluru Airport Terminal 2: బెంగళూరు విమానాశ్రయం కొత్త టెర్మినల్ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా?

Exit mobile version