Site icon Prime9

Road Accident: రక్తమోడిన జాతీయ రహదారి… 27 మంది స్పాట్ డెడ్

road accident in china

road accident in china

Road Accident: చైనాలోని గ్వీఝౌ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు బోల్తా పడింది. దాదాపు 27 మంది ప్రయాణికులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు.

గ్వీఝౌ ప్రావిన్స్‌లోని సందూ కౌంటీలో ఎక్స్‌ప్రెస్‌వే రక్తమోడింది. బస్సు అదుపుతప్పి బోల్తా పడడం వల్ల 27 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. సంధూ ప్రావిన్స్‌ రాజధాని గ్వియాంగ్‌కు 170 కిలోమీటర్ల దూరంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 47 మంది ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు.

కాగా చైనా దేశంలోని ఛాంగ్సూ న‌గ‌రంలో ఉన్న 42 అంతస్తుల బిల్డింగ్‌లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం లేకపోయినా ఆస్తినష్టం ఏర్పడింది. కాగా ఆ ఘటన మరువక ముందే ఈ ప్రమాదం జరగడం చైనా ప్రజలను తీవ్రంగా కలచివేస్తుంది.

ఇదీ చదవండి: Chandigarh University: 60 మంది అమ్మాయిల బాత్రూం వీడియోలు లీక్… ఆ యూనివర్సిటీలో హైటెన్షన్

Exit mobile version