Prime9

Turkey: బొగ్గు గనిలో భారీ పేలుడు.. 25 మంది మృతి, 110 మందికి గాయాలు

Turkey: టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 25 మంది మృతిచెందగా, 110 మందికిపైగా కార్మికులు గాయపడ్డారు. మరో 50 మంది బొగ్గుగనిలోనే చిక్కుకుపోయారు.

శుక్రవారం సాయంత్రం టర్నీలోని బొగ్గగనిలో మీథేన్‌ వాయువు విడుదలవడం వల్ల భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదంలో 25 మంది దుర్మరణం చెందారని అధికారులు వెల్లడించారు. 11 మంది గాయాలతో బయటపడ్డారని వారిని ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. సుమారు 50 మంది కార్మికులు గనిలో 300 నుంచి 350 మీటర్ల దూరంలో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు. వారిని వీలైనంత త్వరగా బయటకు తీసుకువస్తామని.. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుందని సులేమాన్‌ సోయ్‌ల్ అనే అధికారి తెలిపారు. ఇప్పటికే చాలా మందిని బయటకు తీసుకొచ్చామని చెప్పారు. గాయపడినవారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని టర్కీ ఆరోగ్యశాఖ మంత్రి ఫహ్రెట్టీన్‌ కోకా ట్వీట్టర్ వేదికగా తెలిపారు. కాగా టర్కీలోని సోమాలో 2014లో జరిగిన బొగ్గుగని ప్రమాదంలో 301 మంది కార్మికులు మరణించారు.

ఇదీ చదవండి: ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది సజీవ దహనం

Exit mobile version
Skip to toolbar