10th Paper Leak: తెలంగాణలో పేపర్ లీగ్ ల వ్యవహారం పెను సంచలనంగా మారుతోంది. టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారం సద్దుమణగముందే తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో సోమవారం నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. అయితే ఎగ్జామ్ ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం సృష్టిస్తోంది.
పేపర్ లీక్ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు చోటు చేసుకుంది. తాండూరు ఓ సెంటర్ లో క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు సమాచారం. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు మొదలయ్యాయి. అయితే పరీక్ష స్టార్ట్ అయిన 7 నిమిషాల్లోనే క్వశ్యన్ పేపర్ వాట్సాప్ లో చక్కర్లు కొట్టింది. అయితే లీక్ పేపర్ పై స్థానిక అధికారులను ప్రశ్నించగా… అది మన పేపర్ కాదని సమాధానం ఇవ్వడం గమనార్హం. అనంతరం పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్తుల దగ్గర ఉన్న ప్రశ్నాపత్రం.. వాట్సాప్ లో వచ్చిన పేపర్ ఒకటే అని తేలింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెన్త్ పేపర్ లీక్ పై స్థానిక పోలీసులు, విద్యాశాఖ సమాచారం సేకరిస్తోంది. పేపర్ ఎలా లీక్ అయిందనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.