Wipro Freshers: ప్రముఖ టెక్ కంపెనీ విప్రో ఫ్రెషర్స్ కు షాక్ ఇచ్చింది. తాము తొలుత ఆఫర్ చేసి వార్షిక వేతనాన్ని పూర్తిగా ఇవ్వలేవని.. దానిని సగానికి పరిమితం చేస్తామంటూ ఫ్రెషర్స్ కు తాజాగా మెయిల్స్ పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా.. క్లయింట్స్ నుంచి రావాల్సిన ఆర్డర్లు ఆలస్యమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
సగం జీతంతో(Wipro Freshers)
2022-23 లో ఏడాది పాటు శిక్షణ పూర్తి చేసుకున్న జూనియర్లను సగం జీతంతో ప్రాజెక్టులను అంగీకరించాలని కోరింది.
ముందు అనుకున్న 6.5 లక్షల వేతన ప్యాకేజీని .. ప్రస్తుతం 3.5 లక్షలకు తగ్గించుకుని, విధుల్లో చేరాలని ఫిబ్రవరి 16 న పంపిన మెయిల్స్ లో విప్రో పేర్కొంది.
సంవత్సరం ట్రైనింగ్ విజయవంతంగా పూర్తి అయిన వారికి 2023 మార్చి నుంచి రోల్స్ లోకి తీసుకుననే ప్రక్రియ ప్రారంభించింది.
తాజా నిర్ణయాన్ని అంగీకరించిన వాళ్లు.. ఫిబ్రవరి 20 లోపల అభిప్రాయం చెప్పవచ్చని కోరింది.
తప్పడం లేదంటున్న విప్రో
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా.. మా వ్యాపారం అవసరాలకు అనుగుణంగా నియామకాల్లో సర్దుబాట్లు చేసుకుంటున్నాం.
ప్రస్తుతం మేం ఇస్తున్న ఆఫర్ ద్యారా అభ్యర్థులు వెంటనే వారి ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించడమే కాకుండా.. కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చు’ అని మెయిల్స్ లో తెలిపింది.
ప్రస్తుతం సంస్థ ఇచ్చిన ఆఫర్ ను అభ్యర్థులు ఒప్పుకుంటే .. ఇంతకు ముందు ఇచ్చిన ఆఫర్ రద్దు అవుతుందని పేర్కొంది.
శిక్షణ తర్వాత కూడా సరిగ్గా రాణించలేని 425 మంది జూనియర్లను విప్రో ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. ఇపుడు తాజాగా వార్షిక వేతనాన్ని సగానికి తగ్గించుకోమని చెప్పింది.
వ్యాపార పరిస్థితులు మారినందున, ఇది తప్పడం లేదని విప్రో తెలిపింది.
కొత్త ఐటీ ప్రాజెక్టులపై సంతకాలు చేసేందుకు విదేశీ కంపెనీలు ఆలస్యం చేస్తున్నందున..
దేశీయ ఐటీ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు తగ్గించడంతో పాటు ఉన్న ఉద్యోగులకు మరింత శిక్షణ ఇస్తున్నాయి. పనితీరు ఏ మాత్రం బాగోకపోయినా ఉద్యోగులకు ఇంటికి పంపిస్తున్నాయి.