Site icon Prime9

Sundar Pichai: గూగుల్ లో మరోసారి లేఆఫ్స్? తొలగింపులపై సుందర్ పిచాయ్ ఏమన్నారంటే..

Google

Google

Sundar Pichai: ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అసమానతల నేపథ్యలో దిగ్గజ ఐటీ కంపెనీలు కష్ట కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగాల కోతలు అనివార్యమవుతున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు వేలమంది ఉద్యోగులను తొలగించాయి. టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఈ ఏడాది జనవరిలో 12 వేల మందిని తొలగించింది. అయినా పరిస్థితులు అనుకూలంగా లేనట్టు కనిపిస్తున్నాయి. దీంతో గూగుల్ లో మరిన్ని లేఆఫ్స్ ఉండబోతున్నాయనే సంకేతాలు ఇచ్చారు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్. తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూనే అందుకు నిదర్శనం.

ఇంటర్య్వూ లో ఏమన్నారంటే..(Sundar Pichai)

ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ బార్డ్‌, జీ మెయిల్‌, గూగుల్‌ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్టు సుందర్ పిచాయ్‌ (Sundar Pichai)వెల్లడించారు. వాటిలో ఇంకా చాలా పని చేయాల్సి ఉందని తెలిపారు. సదరు ప్రాజెక్టుల్లో ఉన్న అవకాశాలకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే గూగుల్ సిబ్బందిని అధిక ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టుల్లోకి తరలిస్తున్నామన్నారు. కంపెనీలో జరుగుతున్న ప్రతి పనిని లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఖర్చులను పునఃసమీక్షించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే కంపెనీ సామర్థ్యాన్ని మరో 20 శాతం పెంచాలని భావిస్తున్నామన్నారు. అయితే సుందర్ వ్యాఖ్యల్ని పరిశీలిస్తే త్వరలో గూగుల్‌ మరోసారి లేఆఫ్స్ ఉండే అవకాశం ఉందని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది జనవరిలో గూగుల్.. కంపెనీ ఉద్యోగుల్లో 6 శాతం మంది అంటే 12వేల మందిని తొలగించింది. అన్ని అంశాలను నిశితంగా పరిశీలించిన తర్వాతే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకున్నామని అప్పట్లో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ క్రమంలో భారత్ లోని 450 కంపెనీ ఉద్యోగులు కూడా లేఆఫ్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఫిబ్రవరి లో తొలగించిన ఈ సిబ్బంది.. జనవరిలోని 12 వేల తొలగింపుల్లో భాగమా .. కాదా అనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు.

 

Exit mobile version
Skip to toolbar