Site icon Prime9

Mumbai: నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

Stockmarkets open with losses

Stockmarkets open with losses

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిగొన్నాయి. ప్రారంభం నుండి ఊగిసలాడుతూ పలు కంపెనీలు ట్రేడింగ్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 843.79 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 257.45 పాయింట్లు నష్ట పోయింది. పలు కంపెనీలు నష్టాల్లో ట్రేడయినాయి. ప్రధానంగా పవర్‌గ్రిడ్, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, మారుతీ, టైటన్‌, ఇన్ఫోసిస్, టెక్‌ మహీంద్ర షేర్లు నష్టాల్లో ట్రేడయ్యాయి.

మరో వైపు డాలర్ రూపాయి మారకం విలువ రూ. 82.31 వద్ద ఉంది. కేవలం రెండు కంపెనీలు షేర్లు మాత్రమే లాభాలతో ముగిశాయి. వాటిలో యాక్సిస్ బ్యాంకు, ఏషియన్ పెయింట్స్ ఉన్నాయి. ట్రేడింగ్ చివరి సమయానికి ఎన్ఎస్ఈ నిఫ్టీ 16,983.55 వద్ద, బీఎస్ఈ 57,147.32 పాయింట్ల వద్ద స్ధిరపడ్డాయి. ఫారెన్ ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి కనపరచలేదు. దీంతో పలు షేర్లు నష్ట పోయాయి.

ఇది కూడా చదవండి:Haryana: నన్ను గెలిపిస్తే.. రూ.20 పెట్రోల్, రూ. 100కే గ్యాస్..!

Exit mobile version