Site icon Prime9

Stock Markets: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. పతనమైన రూపాయి విలువ..!

Stock market latest updates

Stock market latest updates

Stock Markets: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు అనగా వారంలోని మొదటి రోజు అయిన సోమవారం భారీగా పతనమయ్యాయి. స్టాక్స్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ కూడా 200 పాయింట్లు కోల్పోయింది.

ఇకపోతే దేశీయ ద్రవ్యం అయిన రూపాయి సైతం నేడు మునుపెన్నడూ లేనంతగా బలహీనపడింది. విదేశీ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.64 వద్ద ఆల్ టైం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇవాళ స్టాక్ మార్కెట్ ప్రారంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 767 పాయింట్లు పడిపోయి 57,424 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అలాగే నిఫ్టీ 205 పాయింట్లు క్షీణించి 17,103 వద్ద ట్రేడింగ్‌ మొదలుపెట్టింది.

కాగా ప్రస్తుతం ప్రస్తుతం సెన్సెక్స్‌ 369 పాయింట్ల నష్టపోయి 57,821 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 125 పాయింట్లు క్షీణించి 17,189 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. టాప్‌ గెయినర్స్‌గా యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఉన్నాయి. టాటా మోటార్స్‌, హీరోమోటోకార్ప్‌, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ వంటి ప్రముఖ సంస్థలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: ప్రయాణికులకు షాక్.. నేడు 163 రైళ్లు రద్దు

Exit mobile version