Site icon Prime9

One Plus Smart Phones: వ‌న్‌ప్ల‌స్ తో ముందుగానే దీపావళి పండుగ..!

One plus smart phone Diwali sale

One plus smart phone Diwali sale

One Plus Smart Phones: పండుగ వస్తుందంటే చాలు ఏఏ వస్తువులు ఎంత తక్కువకు వస్తున్నాయో చూస్తాం. దాదాపు ఏడాదంతా ఆగి పండుగ సేల్లో ఎక్కువ వస్తువులను కొనుగోలు చేసేందుకు చూస్తాం. కాగా పండుగ నేపథ్యంలో ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబ‌ర్ 23 బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియా సేల్ అంటూ మొబైల్ ఫోన్లు స‌హా ప‌లు ఉత్ప‌త్తుల‌పై హాట్ డీల్స్ ప్రకటించాయి. అయితే వ‌న్‌ప్ల‌స్ మొబైల్ ఫోన్ల‌పై అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫ‌ర్లు అందుబాటులో ఉన్నాయి.

కాగా మరోవైపు మొబైల్ దిగ్గ‌జం వ‌న్‌ప్ల‌స్ కూడా త‌న అధికారిక వెబ్‌సైట్‌పై దివాళీ సేల్‌ను ప్రారంభిస్తోంది. ఈ సేల్ సెప్టెంబ‌ర్ 22 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సేల్‌లో కంపెనీ వ‌న్‌ప్ల‌స్ 10 ప్రోను రూ 55,999కి విక్ర‌యిస్తోంది.  కాగా ఈ డివైజ్‌ను గ‌తంలో రూ 66,999కి లాంఛ్ చేయ‌గా సేల్‌లో భాగంగా రూ 11,000 డిస్కౌంట్‌కు అమ్మకానికి పెట్టారు. బ్యాంక్ కార్డుల‌పై ఆఫ‌ర్‌తో పాటు డిస్కౌంట్‌ల‌తో క‌లిపి ఈ మొత్తం త‌గ్గింపును కంపెనీ ఆఫ‌ర్ చేస్తోంది. మ‌రోవైపు ఎక్స్ఛేంజ్ ఆఫ‌ర్ల‌తో కొత్త స్మార్ట్‌ఫోన్లను మ‌రింత త‌క్కువ ధ‌ర‌కు కొనుక్కునే వెసులుబాటును వ‌న్‌ప్ల‌స్ కల్పించింది.

ఇదీ చదవండి: Infinix Zero 55 Inch QLED 4K Smart TV: ఇన్ఫినిక్స్ సంస్థవారు విడుదల చేసిన కొత్త టీవి వివరాలు ఇవే!

Exit mobile version