LPG Gas Rates Today: తగ్గిన గ్యాస్‌ సిలిండర్ ధరలు.. కొత్త రేట్లు ఇవే

పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఏడాది ప్రతిపాదికన 22 నుంచి 26 శాతం పెరిగాయని,అక్టోబర్ మొదటి నెలవారీ పెరుగుదల ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పెట్రోల్ అమ్మకాలు 22.7 శాతం పెరిగి 1.28 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి.

  • Written By:
  • Publish Date - November 1, 2022 / 10:03 AM IST

LPG Gas Rates Today: నిత్యం పెరుగుతున్న ధరలతో సతమవుతున్న ప్రజలకు నవంబర్ 01 వ తేదీనా ఉపశమనం కలిగించింది. వాణిజ్య LPG సిలిండర్ ధరలను ప్రభుత్వం భారీగా తగ్గించింది. దేశీయ LPG ధరలను తగ్గించలేదు. కమర్షియల్‌ LPG సిలిండర్‌ ధరను రూ.115.50 తగ్గించింది. ఇక జూలై 6 నుంచి డొమెస్టిక్ సిలిండర్ల రేట్లలో ఎలాంటి మార్పు లేదు. తగ్గిన సిలిండర్ ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. 19 కిలోల LPG సిలిండర్ పాత ధర రూ.1859 కాగా, ప్రస్తుతం రూ.115.50 తగ్గించడంతో సిలిండర్ 1744 రూపాయలకు చేరుకుంది.

పెట్రోల్, డీజిల్ అమ్మకాలు ఏడాది ప్రతిపాదికన 22 నుంచి 26 శాతం పెరిగాయని, అక్టోబర్ మొదటి నెలవారీ పెరుగుదల ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పెట్రోల్ అమ్మకాలు 22.7 శాతం పెరిగి 1.28 మిలియన్ టన్నులకు చేరుకున్నాయి. అదే సమయంలో గడిచిన ఏడాదితో పోల్చుకుంటే 1.05 మిలియన్ టన్నులు పెట్రోల్ అమ్మకాలు బాగా జరిగాయి.

డొమెస్టిక్ సిలిండర్ ధరలను తగ్గించకపోవడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెంచిన ధరలను గత నాలుగు నెలల నుంచి తగ్గించకపోవడంతో నిరాశ చెందుతున్నారు.
ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ఢిల్లీలో రూ.1053 గా ఉంది.
కోల్‌కతాలో రూ.1079 గా ఉంది.
చెన్నైలో రూ.1068 గా ఉంది.
ముంబైలో రూ.1052 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో 1105 రూపాయలకు అందుబాటులో ఉంది.