Site icon Prime9

Iphone 11: యాపిల్ ప్రియులకు గుడ్ న్యూస్.. రూ.21 వేలకే ఐఫోన్‌ 11

iphone-11-apples-best-selling-iphone-available-for-rs-21450-on-flipkart

iphone-11-apples-best-selling-iphone-available-for-rs-21450-on-flipkart

Iphone 11: మార్కెట్లో యాపిల్ పండ్లకు ఎంతటి డిమాండ్ ఉందో యాపిల్ ఫోన్లకు అంతే క్రేజ్ ఉంది. ఐఫోన్ ధర ఎంత ఉన్నా హాట్‌ కేకుల్లా అమ్ముడవుతుంటాయి. యాపిల్‌ నుంచి ఏదైనా కొత్త మొబైల్‌ వచ్చిందంటే చాలు ఇక యూజర్లకు పండగనే చెప్పాలి. ఎప్పుడెప్పుడు కొత్త ఐఫోన్ కొందామా అని ఎదురు చూస్తుంటారు. ఇక అలాంటి ఐఫోన్‌ తక్కువ ధరకు వస్తుందంటే క్షణాల్లోనే అమ్ముడవుతుంటాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్ 11 మొబైల్‌పై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ ఐఫోన్‌ 11పై అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఐఫోన్‌ 11 సిరీస్‌ ఇండియాలో 2019లో రూ.64,900 ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ ఫోన్లు పెద్ద మొత్తంలో అమ్ముడుపోయాయి. ఐఫోన్‌ 11 సిరీస్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 మ్యాక్స్‌ వంటి మూడు మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.21,450కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.40,999 ఉంది. యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. అంటే దాదాపు రూ.2,049 తగ్గింపు లభిస్తుంది. దీనితో పాటు, ఎక్స్చేంజ్ ఆఫర్​కింద మరో రూ.17,500 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో భాగంగా ఈ ఫోన్‌ కేవలం రూ.21,450కే కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌ ఏ13 బయోనిక్‌ చిప్‌సెట్‌తో రన్‌ అవుతుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఐఫోన్‌ 11లో 12 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం కూడా 12 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 3110 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ఫేస్‌ ఐడీ, అల్ట్రా వైడ్‌బ్యాడ్‌కు సపోర్ట్‌ వంటి ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: బంగారం ఇచ్చే ఏటీఎం.. ఎక్కడో తెలుసా..?

Exit mobile version