Twitter: ట్విట్టర్‌ని 44 బిలియన్ల డాలర్లకు టేకోవర్ చేసిన తర్వాత, బిలియనీర్ ఎలోన్ మస్క్ ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ మరియు ఇతర ఉన్నతాధికారులను తొలగించారు. ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్న అగర్వాల్ కు కంపెనీ 42 మిలియన్ డాలర్లు (రూ. 3,457,145,328) ఇవ్వవలసి ఉంటుంది. అగర్వాల్ గత ఏడాది నవంబర్ లో ట్విట్టర్ సీఈవోగా నియమితులయ్యారు.
నిబంధనల ప్రకారం 12 నెలల్లోపే తొలగిస్తే చట్ట ప్రకారం 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.344 కోట్లు. 2021 సంవత్సారానికి పరాగ్ అగర్వాల్ అందుకున్న పారితోషికం 30.4 మిలియన్ డాలర్లు (రూ.250 కోట్లు). అంటే కేవలం ఓ ఏడాదికి సరిపడా వేతనం అతనికి పరిహారం రూపంలో రానుంది.
ఐఐటి బాంబే మరియు స్టాన్‌ఫోర్డ్ పూర్వ విద్యార్థి అయిన అగర్వాల్ దశాబ్దం క్రితం ట్విట్టర్‌లో చేరారు. ట్విట్టర్ లో 1,000 కంటే తక్కువ మంది ఉద్యోగులు ఉన్నారు. మస్క్ ట్విట్టర్‌లో లీగల్, పాలసీ మరియు ట్రస్ట్ హెడ్ విజయ గద్దె మరియు మరో ఇద్దరు ఉన్నతాధికారులను కూడా తొలగించారు.