Prime9

Abhijit Sen: ప్రముఖ ఆర్ధిక వేత్త అభిజిత్ సేన్ గుండెపోటుతో కన్నుమూత

New Delhi: ప్రముఖ ఆర్ధిక వేత్త అభిజిత్ సేన్(72) గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచినటట్లు ఆయన సోదరుడు డాక్టర్ ప్రణబ్ సేన్ వెల్లడించారు. ఆగస్టు 29 న రాత్రి 11 గంటల సమయంలో అతనుకు గుండెపోటు బాగా రావ‌డంతో హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ చేరుకునే సమయంలోనే అభిజిత్ సేన్​ ప్రాణలు వీడిచారని ప్రణబ్ తెలిపారు. అభిజిత్‌ సేన్ నాలుగు దశాబ్దాలుగా ఆర్థికవేత్త‌గా మన దేశానికి ఎన్నో సేవ‌లందించారు. ఆయన చేసిన సేవలు మరువలేనివి.

మన్మోహన్ సింగ్ ప్రధానిగా పని చేస్తున్న సమయంలో ప్రణాళికా సంఘానికి సభ్యుడిగా అభిజిత్ సేన్ ఉన్నారన్న విషయం మన అందరికీ తెలిసిన విషయమే. వ్యవసాయ కమిషన్ ఛైర్మన్​గా కూడా ఈయన పని చేశారు. అంతే కాకుండా డీల్లీ లోని జవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్​గా కూడా పనిచేశారు. అభిజిత్‌ సేన్కు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పై బాగా అవగాహన ఉంది.

అభిజిత్ సేన్ మృతి పట్ల రాజకీయ వేత్తలు, సినీ నటులు, ప్రముఖులు సంతాపం తెలిపి, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్థిక రంగంలో ఆయన చేసిన చేసిన సేవలు మరుమలేమని తెలిపారు.

Exit mobile version
Skip to toolbar