Best Investment Tips: షేర్ మార్కెట్‌లో లాభాలు రావాలంటే చాలా మార్గాలే ఉన్నాయి. షేర్ల ద్వారా మ్యూచ్యువల్ ఫండ్స్ ద్వారా ఇలా అనేక మార్గాల్లో పెట్టుబడి పెట్టడం వల్ల తక్కువ కాలంలో చాలా ఈజీగా ఎక్కువ డబ్బులు సంపాందించవచ్చు.
ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. కానీ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే,కొన్ని ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
లిక్విడ్ ఫండ్స్
మీ డబ్బులను లిక్విడ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టి అధిక డబ్బును ఇక్కడ సంపాదించవచ్చు. సేవింగ్ అక్కౌంట్‌తో పోలిస్తే దీనిలో రిటర్న్స్ ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే 91 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డబ్బులను సెక్యూరిటీస్‌లో పెట్టుబడిగా పెడతారు. ఈ పెట్టుబడి మీకే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు. వదిలేయవచ్చు. లిక్విడ్ ఫండ్స్‌పై ట్యాక్స్ మినహాయించుకుని 4 నుంచి 7 శాతం మధ్య రిటర్న్స్ వస్తాయి.
అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్
అల్ట్రా షార్ట్ డ్యూరేషన్ ఫండ్ అనేది ఒక డెబ్ట్ ఫండ్. ఈ కంపెనీలు 3-6 నెలల వరకు రుణాలు ఇస్తుంటాయి. ఈ ఫండ్స్‌లో రుణ వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఇందులో లిక్విడ్ ఫండ్‌తో పోలిస్తే ఇది కొంచం రిస్క్ గానే ఉంటుంది. కానీ పెట్టుబడి పెట్టేందుకు అతి తక్కువ రిస్క్ కలిగిన పథకం ఇదే.
మంకీ మార్కెట్ ఫండ్స్
రిస్క్ వ్యవహారంలో చూసుకుంటే ఈ మ్యూచ్యువల్ ఫండ్స్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే రిస్క్ చాలా తక్కువ. సాధారణంగా డబ్బులు మార్కెట్ ఫండ్ అనేది కాల్ మనీ మార్కెట్, ట్రెజరీ బిల్, 3-12 నెలల మధ్య పెట్టుబడి పెట్టవచ్చు. ఈ మార్కెట్ ఫండ్స్ డీఫాల్ట్ వడ్డీ రేట్లు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి.